తెలుగులో ఎంట్రీకి రంగం సిద్ధం

తెలుగులో ఎంట్రీకి రంగం సిద్ధంకన్నడ కథానాయకుడు శివరాజ్‌ కుమార్‌ తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడు. ఆయన సతీమణి గీతా శివ రాజ్‌కుమార్‌ పుట్టినరోజు సందర్భంగా శివ రాజ్‌కుమార్‌ నెక్స్ట్‌ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్‌ చేశారు. ఆయన కన్నడ, తెలుగు భాషల్లో ఓ సినిమా చేయనున్నారు. ఈ బైలింగ్వల్‌ ఫిల్మ్‌ని కార్తీక్‌ అద్వైత్‌ దర్శకత్వంలో పద్మజ ఫిలింస్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సమర్పణలో భువనేశ్వరి పిక్చర్స్‌ బ్యానర్‌పై ఎస్‌ఎన్‌ రెడ్డి, సుధీర్‌ పి నిర్మిస్తున్నారు. శివరాజ్‌ కుమార్‌ని కంప్లీట్‌ కొత్త లుక్‌, క్యారెక్టర్‌లో ప్రజెంట్‌ చేసే ఈ మూవీపై అభిమానులలో భారీ అంచనాలు ఉన్నాయి. స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయింది. ఇప్పటికే మ్యూజిక్‌ కంపోజిషన్‌ జరుగుతోంది. అఫీషియల్‌ లాంచ్‌ వేడుక ఆగస్ట్‌లో ఉంటుంది. తెలుగు చిత్ర పరిశ్రమలో విజయవంతమైన చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్న నిర్మాత ఎస్‌ఎన్‌రెడ్డి ఈ బైలింగ్వల్‌ వెంచర్‌ కోసం సుధీర్‌ పి.తో కొలబరేట్‌ అవుతున్నారు. ఎస్‌ఎన్‌రెడ్డి రీసెంట్‌ ప్రాజెక్ట్‌ ‘జీబ్రా’ తెలుగు, కన్నడ రెండింటిలోనూ విడుదల కానుంది.