వర్చువల్ పద్ధతిలో వేములవాడ కోర్టులో ఈ సేవ కేంద్రం ప్రారంభం..

The start of this service center in Vemulawada court in virtual mode..– ప్రారంభించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి..
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి, సిరిసిల్ల, వేములవాడ న్యాయమూర్తులు.. 
– వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం..
నవతెలంగాణ – వేములవాడ
వర్చువల్ పద్ధతిలో వేములవాడ   కోర్ట్ కాంప్లెక్స్  నందు ఆదివారం  ఈ సేవా కేంద్రాన్ని సుప్రీంకోర్టు న్యాయమూర్తి పామిడిగంటం నరసింహ ప్రారంభించారు. ఈ ప్రారంభ సమయంలో రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రేమలత, సీనియర్ సివిల్ జడ్జి, రాధిక జైష్వాల్, జూనియర్ సివిల్ జడ్జ్ జ్యోతిర్మయి, వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, ఏజిపి పుప్పాల భాను కృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ ఈ సేవా కేంద్రం ద్వారా  కేసు స్థితిగతులు, తదుపరి విచారణ తేది సంబంధిత విచారణలు స్వీకరించడం అని తెలిపారు. సర్టిఫైడ్ కాపీలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ, హర్డ్ కాపీ పటిషన్ల స్కానింగ్, ఈ- సంతకం. వీటిని సి.ఐ. ఎస్.లోకి దాఖలు చేయడం ఫైలింగ్ నంబరును జనరేట్ చేయడం వంటి వాటితో పిటిషన్ల ఈ-ఫైలింగును సులభతరం చేయడం జరుగుతుందని చెప్పారు. ఈ స్టాంప్ పేపర్ల కొనుగోలులో కక్షిదారులకు సహాయపడటం, ఆధార్ ఆధారిత డిజిటల్ సంతకాన్ని పొందుటలో సహాయపడటం, ఆండ్రాయిడ్  ఐ.పి.ఎస్. ఆధారిత చరవాణులలో ఈ -కోర్స్ అనువర్తనానికి సంబంధించిన ప్రకటనలు వెలువరించడం  వాటిని డౌన్లోడ్ చేసుకోవడంలో సహాయపడటం.ఈ-ములాఖ త్ అపాయింట్మెంటు ద్వారా జైలులో ఉన్న బంధువులను కలవడానికి సహాయపడటం, సెలవుపైనున్న న్యాయాధికారులకు సంబంధించిన విచారణలకు సమాధానమివ్వడం, ఏదేని న్యాయస్థానము యొక్క చిరునామా స్థానానికి సంబంధించిన విచారణలకు, కాజీలిస్ట్, ఏదేని కేసు విచారణకు చేపట్టబడినదా లేదా అనే విచారణలకు సమాధానమివ్వడం, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ లేదా హైకోర్టు న్యాయ సేవాధికార సంస్థ లేదా సుప్రీం కోర్టు న్యాయ సేవాధికార సంస్థల నుండి ఉచిత న్యాయ సేవలను ఎలా పొందాలనే విషయంలో ప్రజలకు మార్గనిర్దేశకత్వం చేయడం అని అన్నారు. ట్రాఫిక్ చలాన్లు చిన్న నేరాలకు సంబంధించిన ఫైన్ చెల్లింపులను ఆన్లైన్లో కట్టుటకు వీలు కల్పించడం. ఈ-కోర్టు సేవల ద్వారా డిజిటల్ రూపంలో అందుబాటులో ఉన్న అన్ని ఇతర సేవల గురించిన సందేహాలను నివృత్తి చేయడం వంటివి సులభతరంగా తెలుసుకోవచ్చని తెలిపారు.కక్షిదారులు న్యాయవాదులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు పొత్తూరి అనిల్ కుమార్ ,గుండా రవి, కిషోర్ రావు ,బొడ్డు ప్రశాంత్ కుమార్, నర్సింగ రావు, గొంటి శంకర్, గుజ్జ మనోహర్ ,జెట్టి శేఖర్ ,జంగం అంజయ్య, అనిల్ ,మహిళా న్యాయవాదులు సుజాత ,అన్నపూర్ణ తో పాటు తదితరులుపాల్గొన్నారు.