అడ్డదారిలో అక్రమ రవాణాతో రాష్ట్ర ఖజానాకు గండి

– అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ పెద్ద తడుగూర్ రోడ్డు
– రాత్రి పగలు తేడా లేకుండా వందల లారీలు అక్రమ రవాణా
నవతెలంగాణ – మద్నూర్
అక్రమ రవాణాకు కేరాఫ్ అడ్రస్ పెద్ద తడుగూర్ రోడ్డు అడ్డు దారిని అడ్డుకట్ట వెయ్యరు అక్రమ రవాణాతో రాష్ట్ర ఖజానాకు ప్రతిరోజు వేలాది రూపాయలు ఆదాయం కోల్పోయి, గండిపడుతోంది తెలంగాణ రాష్ట్రానికి. మద్నూర్ మండల కేంద్రం రాష్ట్రానికి పూర్తిగా మారుమూల ప్రాంతంలో ఉంది. మహారాష్ట్రకు పూర్తిగా బార్డర్ లో ఉంది. మన రాష్ట్ర సరిహద్దు లో అంతర్రాష్ట్ర ఆర్టీవో శాఖ, ఎక్సైజ్ శాఖ, చెక్పోస్టులు జాతీయ రహదారి పైన ఉన్నాయి. ఈ రహదారి గుండా కాకుండా మద్నూర్ మండల కేంద్రం అడ్డుదారి పెద్ద తడూగుర్ రోడ్డు గుండా మహారాష్ట్ర సరిహద్దులోని మహారాష్ట్ర ప్రాంతంలో గల నాగరాల గ్రామం మీదుగా మహారాష్ట్ర ప్రాంతంలోకి ప్రవేశిస్తున్నాయి. అటు నుంచి ఇటు ఈ రహదారి గుండా తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తున్నాయి. మన రాష్ట్ర సరిహద్దులో జాతీయ రహదారిపై ఉన్న అంతర్రాష్ట్ర చెక్పోస్టుల మీదుగా కాకుండా అడ్డుదారుల గుండా వాహనాలు తరలిస్తూ మన రాష్ట్ర ఆదాయానికి పూర్తిగా గండి కొడుతున్నారు. మత్తు పదార్థాలు మన రాష్ట్రంలోకి ప్రవేశించకుండా అంతర్రాష్ట్ర చెక్పోస్టు ఉన్నప్పటికీ చెక్పోస్టు రహదారి గుండా కాకుండా అడ్డుదారుల గుండా వాహనాలు తరలి వెళ్లడం అక్రమ రవాణా వాహనాలు ఎలాంటి సరుకు తరలి వెళ్తుందో తెలియని పరిస్థితి. ఓవర్ లోడ్ వాహనాల ద్వారా మన రాష్ట్ర ఆదాయానికి వచ్చే ఆదాయాన్ని తప్పించుకొని, అడ్డుదారుల గుండా తరలించడం పన్ను చెల్లించలేక రాష్ట్రదానికి పూర్తిగా గండి పడుతుంది. అడ్డుదారిని అడ్డుకట్ట వేయలేక రోజుకు రాత్రింబవళ్లు వందల సంఖ్యలో వాహనాలు తరలి వెళ్లడం మన రాష్ట్ర ఆదాయానికి ఆదాయం గండి కొట్టడమే కాకుండా వాహనాల్లో ఎలాంటి సరుకు తరలి వెళ్తుందో మత్తు పదార్థాలు వంటి వాహనాలు తరలివెళ్లి ఆస్కారం లేకపోలేదని, మండల ప్రజల్లో చర్చలు వినబడుతున్నాయి ఈ అడ్డుదారికి చెక్పోస్టులు ఏర్పాటు చేయవలసిందేనని మండల ప్రజలు కోరుతున్నారు.