– వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. ప్రధాని రాహులే
– కాంగ్రెస్ సీనియర్ నేత వి.హానుమంతరావు
నవతెలంగాణ-నల్లగొండ కలెక్టరేట్
రీజనల్ రింగ్ రోడ్డు విషయంలో శాంతియుతంగా సమస్యలపై స్పందించి న్యాయం చేయాలని అడిగిన రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు సంకెళ్లు వేసిన ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వమని ఏపీసీసీ మాజీ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత వీ.హానుమంతరావు విమర్శించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని జైలులో నాన్ బెయిలబుల్ కేసులతో ఉన్న భువనగిరి, ఆలేరు రైతులు, కాంగ్రెస్ నాయకులను ఆయన పరామర్శించి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం జిల్లా జైలు భయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఆర్‌ఆర్ బాదితుల న్యాయమైన సమస్యలను పరిష్కరించకుండా కేసులు పెట్టడం దారుమని, ఇది పెద్ద స్కామ్ అన్నారు. ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు వెంచర్లకు సహాకారం అందించాలనే దురుద్దేశంతోనే రైతులపై ప్రణాళికా బద్దంగా కేసులు నమోదు చేయించారన్నారు. ప్రజాప్రతినిధులపై ఎలాంటి దాడి చేయకున్నా, ఎలాంటి ఆయుధాలు రైతుల వద్ద లేకపోయినా కానీ అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు అమాయక రైతులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి 450 ఎకరాల భూమిని తీసుకునే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. వెంచర్ల నిర్వాహాకులతో స్థానిక ఎమ్మెల్యే కుమ్మక్కయ్యాయరని, సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ది ఉంటే ఇది నిజామో కాదో విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. దశాబ్ది ఉత్సవాలకు రూ.105 కోట్లు కేటాయించి రైతులను జెలులో పెట్టి దశజయంతి ఉత్సవాలు నిర్వహించుకోవడం శోచనీయమన్నారు. మీడియా అందరికి సమానమే అందరికి యాడ్స్ ఇవ్వాలని, వారిపై వ్యత్యాసాలు చూపవద్దన్నారు. వచ్చే ఎన్నికలలలో తెలంగాణలో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమని, దేశంలో రాహుల్ గాంధీయే ప్రధాన మంత్రి అవుతారన్నారు. రైతుల మీద అన్యాయపు కేసులను ఎత్తి వేసి వారి భూములను కాపాడాలని డిమాండ్ చేశారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో రోడ్లపైకి వచ్చి పెద్ద ఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షులు శంకర్ నాయక్, జడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహాన్రెడ్డి, బొంత వెంకటయ్య, కోట శ్రీనివాసరావు, సూరెడ్డి సరస్వతి, పాశం నరేష్రెడ్డి, సూరెడ్డి సరస్వతి, జూలకంటి సైదిరెడ్డి, చర్లపల్లి గౌతమ్, కార్తీక్, గాలి నాగరాజు, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు