నవతెలంగాణ-భిక్కనూర్
సంఘాలు, ఆలయాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ తెలిపారు. సోమవారం జంగంపల్లి గ్రామంలోని ఎల్లమ్మ ఆలయానికి 5 లక్షలు, మార్కండేయ ఆలయానికి 5 లక్షలు, పోచమ్మ ఆలయానికి 4 లక్షలు, ఆంజజనేయ ఆలయానికి 4 లక్షలు మంజూరు చేయడం జరిగిందని గ్రామ సర్పంచ్ నర్సింలు యాదవ్, డిసిసిబి డైరెక్టర్ సిద్ధ రాములు తెలిపారు.
సంఘాలకు నిధులు మంజూరు..
జంగంపల్లి గ్రామంలోని ముదిరాజ్ సంఘం, విశ్వబ్రాహ్మణ సంఘం, గొల్ల యాదవ సంఘం, ఎస్సీ మాల సంఘాలకు ఒక్కో సంఘానికి మూడు లక్షల చొప్పున 12 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని సర్పంచ్ నరసింగ యాదవ్, డిసిసిబి డైరెక్టర్ సీద్దరాములు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాలు, సంఘాలు, ఆలయాల అభివృద్ధికి సహకరిస్తున్న ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ కు రుణపడి ఉంటామని గ్రామస్తుల తలుపుల ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మండల సెక్రెటరీ శ్రీనివాస్, బిఆర్ఎస్ గ్రామ అధ్యక్షులు బాలచంద్రం, ఆయా సంఘాల అధ్యక్షులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.