
నవతెలంగాణ – మద్నూర్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందని జుక్కల్ ఎమ్మెల్యే తోటా లక్ష్మి కాంతారావు తెలిపారు. మద్నూర్ మండలంలోని లచ్చన్ పాఠశాలలో మంగళవారం నాడు ఆ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన నోటు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాములు నాయక్ ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివరాం మద్నూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుటుంబ సభ్యులు సౌజన్య రమేష్ మద్నూర్ సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్ పటేల్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.