వ్యవసాయ కార్మికుల పట్ల సోయి లేకుండా వ్యవరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం..

– భూమిలేని వ్యవసాయ కార్మికులకు 12 వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి.
– తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు డిమాండ్.
నవతెలంగాణ – భువనగిరి
      తమ ఎన్నికల వాగ్దానంలో భూమిలేని వ్యవసాయ కూలీలకు సంవత్సరానికి రూ. 12 వేలు ఇస్తానన్న ప్రభుత్వం సంవత్సరం పూర్తయిన నేటికీ డబ్బులు ఇవ్వకుండా సోయి లేకుండా వ్యవహరిస్తుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు విమర్శించారు. ఇప్పటికైనా భూమిలేని ప్రతి వ్యవసాయ కార్మిక కుటుంబానికి వెంటనే రూ. 12 వేలు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక సుందరయ్య భవన్, భువనగిరిలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా వర్క్ షాప్ జిల్లా అధ్యక్షులు బొల్లు యాదగిరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా  వెంకట్రాములు పాల్గొని మాట్లాడుతూ భూమిలేని వ్యవసాయ కార్మికులకు ఉపాధి హామీ జాబు కాడ ద్వారా వంద రోజులు పని చేసిన కుటుంబానికి 12 వేల రూపాయల స్కీముకు ఎంపిక చేయబోతున్నట్లు వస్తున్న వార్తలపై ప్రభుత్వం వెంటనే వివరణ ఇవ్వాలని  కోరారు. లబ్ధిదారులను గ్రామసభల ద్వారా అర్హత ఉన్న జాబు కార్డు దారులతోపాటు వలస కార్మికులకు, కూలి పని చేసుకుని బతికే పేదలందరిని అర్హులుగా ఎంపిక చేయాలని  సూచించారు. జాబు కార్డు ఆధారంగా లబ్ధిదారులను గుర్తిస్తామంటే చాలామందికి వివిధ కారణాల చేత జాబు కార్డు లేని పరిస్థితి ఉన్నదన్నారు. దాని ఆధారంగానే లబ్ధిదారులను ఎంపిక చేయడం అనేది కరెక్ట్ కాదని ఈ ఆలోచనను ప్రభుత్వం తక్షణమే స్వస్తి చెప్పి గ్రామాలలో సభలు నిర్వహించి భూమిలేని ప్రతి కూలీని, పేదలను ఈ స్కీంకు ఎంపిక చేయాలని అన్నారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కోసం పనిచేస్తున్న వ్యవసాయ కార్మిక సంఘాలు, దళిత, గిరిజన, మహిళ, ఎన్జీవోలు వంటి సంఘాలతో ఉమ్మడి సమావేశము ప్రభుత్వం నిర్వహించి అభిప్రాయాలను తీసుకోవాలని వారు ప్రభుత్వానికి సూచించారు. దేశంలో వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేసి కనీస వేతనాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం కేరళ రాష్ట్రమని అన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని కూడా అన్ని మున్సిపల్ పట్టణాల్లో అమలు చేస్తున్న రాష్ట్రం కూడా కేరళ రాష్ట్రమే అని అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి తోపాటు అన్ని రంగాలను ప్రజలకు అందుబాటులో ఉంచి ప్రజలకు సేవ చేస్తున్న వామపక్ష ప్రభుత్వాన్ని మతోన్మాద కార్పొరేట్ శక్తుల అనుకూలమైన మోడీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టాలని చూస్తుందని ఈ మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కేరళ వామపక్ష ప్రభుత్వానికి అండగా ప్రజా సంఘాలు, ప్రజాసామిక వాదులు, లౌకిక శక్తులు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ మాట్లాడుతూ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా రూ. 12 వేల  స్కీమ్ అమలు కోసం, మోడీ ప్రభుత్వం దళితులపై జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా, దళితవాడల అభివృద్ధి కోసం, చట్టాల అమలు కోసం, కూలీ రేట్ల పెంపు కోసం, భూమి పంపిణీ కోసం,
జనవరి 1 నుండి 30వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని కూలీ వాడలలో, దళిత గిరిజన పేటలలో పర్యటనలు చేస్తామని దాని ఆధారంగా గుర్తించిన సమస్యలపై పోరాటాలు కొనసాగిస్తామని ఈ పోరాటాలను ప్రజలు, వ్యవసాయ కార్మికులు బలపరిచి జయప్రదం చేయాలని  పిలుపునిచ్చినారు. జిల్లాలో ఆరేడు మండలాల్లో కొనసాగుతున్న భూపంపి నిషేధం ఎత్తి వేత కోసం కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికలలో మున్సిపల్ పట్టణాల్లో  జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభం ఇస్తామని చెప్పిన దాని ప్రకారం అమలు చేయాలని నర్సింహ కోరారు. ఈ వర్క్ షాప్ లో సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు జల్లెల్ల పెంటయ్య, సహాయ కార్యదర్శులు సిరిపంగి స్వామి, గుంటోజి శ్రీనివాస్ చారి, సల్లూరి కుమార్ ఉపాధ్యక్షులు జూకంటి పౌల్, పల్లెర్ల అంజయ్య జిల్లా కమిటీ సభ్యులు బొజ్జ బాలయ్య, దొడ్డి బిక్షపతి, వల్లంబట్ల శ్రీనివాసరావు, మాన సాలయ్య, రాపోతు పద్మ, కేతావత్ లక్ష్మి, చింతకాయల నరసింహ, బొమ్మకంటి లక్ష్మీనారాయణ, కొండాపురం యాదగిరి, బొల్లెపల్లి కిషన్, కటికల రామచంద్రం, నాయకులు పొట్ట వెంకటయ్య, చారకొండ వెంకటేశ్వర్లు, పావనగంటి నగేష్, చెక్కిళ్ల ఉపేంద్ర, గాదే చంద్రయ్య, గడ్డం సుదర్శన్, వేముల లక్ష్మయ్య  పాల్గొన్నారు.