రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలి

The state government should implement the SC declarationనవతెలంగాణ – రాయపోల్
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేవెళ్ల సభలో ప్రకటించిన ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయాలని బిజెపి ఎస్సీ మోర్చా మండల అధ్యక్షులు టెంకంపేట నర్సింలు అన్నారు. సోమవారం రాష్ట్ర బిజెపి ఎస్సీ మోర్చా అధ్యక్షులు కొండేటి శ్రీధర్ ఆదేశాల మేరకు రాయపోల్ మండల తహసిల్దార్ కి మెదక్ పార్లమెంట్ ఎస్సీ మోర్చా ఇంచార్జ్ మంకిడి స్వామి, బిజెపి మండల అధ్యక్షులు రాజా గౌడ్ ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చేవెళ్లలో నిర్వహించిన ఎస్సీ డిక్లరేషన్ ఏర్పాటు చేస్తామని నిధులు ఇస్తామని తెలియజేయడం జరిగిందని,డిక్లరేషన్ లో ప్రధానంగా అంబేద్కర్ అభయహస్తం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా  ఉపాధి రుణాలు.  షెడ్యూల్ కులాల వెనుకబడిన సాంఘిక సంక్షేమ వసతి గృహాల పునర్ నిర్మాణాలపై బడ్జెట్లో ప్రస్తావించకపోవడం బాధాకరమన్నారు.అంబేద్కర్ అభయాసం కింద ప్రతి కుటుంబానికి 12 లక్షల ఆర్థిక సహాయం, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 750 కోట్లను కేటాయించాలన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా యువతకు స్వయం ఉపాధి కోసం సంవత్సరానికి 1000 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.ఈ కార్యక్రమంలో రాయపోల్ మండల బిజెపి మాజీ అధ్యక్షులు మాజీ మాదాసు వెంకట్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శులు నీల స్వామి,కృష్ణ గౌడ్, సీనియర్ నాయకులు వెంకటేష్ గౌడ్, ఎస్సీ మోర్చా మండల ఉపాధ్యక్షులు కరుణాకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.