కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం పచ్చగా..!

కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం పచ్చగా..!– ఢిల్లీ దొరల చేతిలో మరోసారి తెలంగాణ బంధి కావాలా..!
– కేసీఆర్‌ అంటేనే భరోసా, యువతకు భవిష్యత్‌..
– కాంగ్రెస్‌ చిల్లర మాటలకు లొంగొద్దు
– ఒక్కసారి ఆలోచించి.. ఓటు వేయండి: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌
నవతెలంగాణ-సిరిసిల్ల/వేములవాడ
సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రంలో ఎటు చూసిన పచ్చదనం, సాగు నీరు, తాగునీరు, సమద్ధిగా కరెంటు, సుభిక్షంగా పంటలు పండుతున్నాయని, బీఆర్‌ఎస్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని, కాబటిఆ్ట కాంగ్రెస్‌ పార్టీ చిల్లర మాటలకు లొంగిపోకుండా ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయాలని మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు కె.తారక రామారావు అన్నారు. సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ టెక్‌సెల్‌ వింగ్‌ను మంత్రి కేటీఆర్‌ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు మంత్రి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. గులాబీ కండువాలు కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్ర ప్రజలకు కడుపు నిండా సంక్షేమ పథకాలు అందుతున్నాయ న్నారు. ఈ తొమ్మిదిన్నరేండ్లలో సీఎం కేసీఆర్‌ ఒక్కసారి కూడా కులాల పేరుతో కుంపట్లు, మతాల పేరుతో మంటలు పెట్టలేదని, ప్రాంతం పేరుతో పంచాయితీ లు పెట్టే ప్రయత్నం చేయలేదన్నారు. అభివృద్ధే కులంగా, సంక్షేమమే మతంగా పరిపాలన సాగించారని వెల్లడించారు. అలాంటి నాయకుడిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పారు. సిరిసిల్ల జిల్లాలోని నాలుగు నియోజక వర్గాల్లో మళ్లీ గులాబీ జెండా ఎగరాలని చెప్పారు. ఇటీవల జరుగుతున్న ప్రపంచ వరల్డ్‌కప్‌లో విరాట్‌ కోహ్లీ సెంచరీ కొట్టినట్టు రాష్ట్రంలో 100 సీట్లు సాధిద్దామని ప్రజలను ఉత్తేజపరిచారు. కార్య క్రమంలో మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఆర్టీసీ మాజీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌, నాస్కాబ్‌ చైర్మెన్‌ కొండూరి రవీందర్రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మెన్‌ గూడూరి ప్రవీణ్‌, జిల్లా బీఆర్‌ఎస్‌ అధ్యక్షులు తోట ఆగయ్య, గ్రంథాలయ చైర్మెన్‌ ఆకునూరి శంకరయ్య, బీఆర్‌ఎస్‌ సిరిసిల్ల టౌన్‌ అధ్యక్షుడు జిందం చక్రపాణి పాల్గొన్నారు.
ఢిల్లీ దొరల చేతిలో మరోసారి తెలంగాణ బంధి కావాలా..!
వేములవాడ పట్టణంలో జరిగిన యువ ఆత్మీయ సమ్మేళనానికి కేటీఆర్‌ మాట్లాడుతూ.. ఢిల్లీ దొరల చేతిలో మరోసారి తెలంగాణ బందీ కావాలా.. లేక సీఎం కేసీఆర్‌ చేతిలో ముక్తి పొందాలో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్‌ అంటేనే భరోసా, యువతకు భవిష్యత్‌ అని అన్నారు. వేములవాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నరసింహా రావును భారీ మెజా రిటీతో గెలిపిస్తే, వేములవాడ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటా నని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీ నర్సింహారావు మాట్లాడుతూ.. యువ నాయ కుడు కేటీఆర్‌ కేవలం వ్యక్తి కాదు, తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని అన్నారు. యువకుల భవిష్యత్‌ బాగుండా లని, ప్రపంచంలోని చాలా దేశాలు తిరిగి పెట్టుబడులు తీసుకొచ్చారని కొనియాడారు. ఈ కార్య క్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినిపల్లి వినోద్‌ కుమార్‌, నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్‌, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మెన్‌ లోక బాపు రెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ రాఘవ రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ రామతీర్థపు మాధవి, విద్యార్థి జేఏసీ నాయకులు మందా ల భాస్కర్‌, సీనియర్‌ నాయకులు మనోహరరెడ్డి, దరువు ఎల్లన్న, నాయకులు వెంగళ శ్రీకాంత్‌ గౌడ్‌, ఈర్లపల్లి రాజు, కౌన్సిలర్లతో పాటు ఆయా మండలాల యువజన, విద్యార్థి విభాగం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు.