మంకాలమ్మ దయతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

– దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి
నవతెలంగాణ – తొగుట
అమ్మవారి దయతో సకాలంలో వర్షాలు కురిసి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని దుబ్బాక ఎమ్మెల్యే, జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్ రెడ్డి వేడుకున్నారు. బుధవారం మండలంలోని గుడికం దుల గ్రామంలో జరుగుతున్న మహంకాళి అమ్మ వారి ఉత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు కురుస్తేనే, రైతు బాగుంటేనే రాజ్యం బాగుం టుందన్నారు. యాసంగి లో చేతికి వొచ్చిన పంట లు ఎండిపోవడంతో రైతులకు తీరని నష్టం వాటిల్లిందన్నారు. ఈ ఏడు అమ్మవారి దయతో పుష్క లంగా వర్షాలు కురువాలని కోరినట్లు తెలిపారు. అనంతరం మండలంలోని పెద్ద మసాన్ పల్లిలో జరిగిన వెంకట్రావుపేట బీఆర్ఎస్ గ్రామ పార్టీ అధ్యక్షుడు పులిగారి శివయ్య కుమారుడు గణేష్, వడ్డెర కాలనీకి చెందిన బొదాసు కనకయ్య కుమా రుడు మధు, అల్వాల లో జరిగిన వెంకట్రావుపేట  బీఆర్ఎస్ యువ నాయకుడు నాగులపల్లి యాద గిరి వివాహానికి హాజరై నూతన వదు వరులను  ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి, సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి, వైస్ ఎంపీపీ బాసిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి, మాజీ సర్పంచ్ గంగని గల్ల మల్లయ్య, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్లు దోమల కొమురయ్య, కంది రాంరెడ్డి, బోయి ని శ్రీనివాస్, కొల కనకయ్య గౌడ్, సుతారి రాము లు, రాంబాబు, గంగోళ్ల ఆంజనేయులు, తదితరు లు పాల్గొన్నారు.