నవతెలంగాణ – హైదరాబాద్: కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ప్రాధాన్యం దక్కేలా చూడాలి. ఫిబ్రవరి 1న ప్రకటించే కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి నిధులు కేటాయించాలి. అప్పులు తెలంగాణగా మారిన తెలంగాణకు కేంద్రం ఆర్థిక సహాయం అందించాలి. గత ప్రభుత్వం నుంచి కూడా కేంద్ర బడ్జెట్లో బిజెపి అన్యాయమే చేస్తుంది. కేంద్ర మంత్రులుగా ఉన్న తెలంగాణ రాష్ట్ర కేంద్ర మంత్రులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని మనవి. ఈసారి కూడా కేంద్ర బడ్జెట్లో నిధులు రాబట్ట లేనప్పుడు ఎన్డిఏ బిజెపి ప్రభుత్వం, తెలంగాణ కేంద్ర మంత్రులు తెలంగాణ సమాజాన్ని కావాలనే మోసం చేస్తున్నట్లుగా భావించవలసి ఉంటుంది.