రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీ లతోపాటు 42 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 400 రోజులు పూర్తయిన సందర్భంగా హామీలను నెరవేర్చడం లేదని అమలు చేసే విధంగా చూడాలని గాంధీ విగ్రహానికి బిఆర్ఎస్ శ్రేణులు గురువారం వినతి పత్రం అందజేశారు. మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నివాళులు అర్పించారు. మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ మరియు మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, మాజీ జెడ్పిటిసి బీరు మల్లయ్య, బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి, సీనియర్ నాయకులు సురపల్లి రమేష్, ఎడ్ల సత్తిరెడ్డి, అబ్బగాని వెంకట్ గౌడ్, కుశంగల రాజు, తుమ్మల పాండు, బర్రె రమేష్, తాడెం రాజు, తాడూరు బిక్షపతి, ఇక్బాల్ చౌదరి, పాల్గొన్నారు.