6 గ్యారంటీలను అమలు చేయాలని గాంధీ విగ్రహానికి వినతి..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 

గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ గురువారం గాంధీ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ భువనగిరి మాజీ శాసనసభ్యులు  పైళ్ల శేఖర్ రెడ్డి  ఆదేశానుసారం భువనగిరి పట్టణంలోని గాంధీ పార్క్ లో  పట్టణ , మండల శాఖ ఆధ్వర్యంలో గత అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలతోపాటు 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి అయినా హామీలను నెరవేర్చడం లేదని ఆ హామీలను అమలు చేసే విధంగా చూడాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ జడల అమరేందర్ గౌడ్ , మాజీ మున్సిపల్ చైర్మన్ ఎన్నబోయిన ఆంజనేయులు, బిఆర్ఎస్ పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు ఏవి కిరణ్ కుమార్, జనగాం పాండు, మాజీ జెడ్పిటిసి బీరు మల్లయ్య బిఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి రచ్చ శ్రీనివాస్ రెడ్డి,  సీనియర్ నాయకులు సురపల్లి రమేష్, ఎడ్ల సత్తిరెడ్డి, అబ్బగాని వెంకట్ గౌడ్, కుశంగల రాజు, తుమ్మల పాండు, బర్రె రమేష్, తాడెం రాజు, తాడూరు బిక్షపతి, ఇక్బాల్ చౌదరి, కాజం, ఇస్మాయిల్, సుభాష్, శివ, నరసింహ,సైదులు పాల్గొన్నారు.