పాప గొంతు నులిమి హతమార్చిన సవతి తండ్రి

నవతెలంగాణ – మాక్లూర్
అభం శుభం తెలియని పసి పాపను గొంతు నులిమి దారుణంగా హతమార్చిన సవతి తండ్రి.  ఈ హృదయవిధాకర దుర్ఘటన మండలంలోని ధర్మొరలో చోటు చేసుకుంది. తండ్రి అరుణ్ నిద్రిస్తున్న చిన్నారి లక్కీ(4)ను గొంతు నులిమి హతమార్చాడు. పోలీస్లు తెలిపిన కథనం ప్రకారం.. ధర్మోరా గ్రామానికి చెందిన ఈర్నాల అరుణ్ ఏడాది క్రితం నిజామాబాద్ కు చెందిన సునీతని రెండో వివాహం చేసుకున్నారు. అయితే సునీత మొదటి భర్తకు జన్మించిన ఒక కూతురు లక్కీ అనే చిన్నారి ఉంది. అరుణ్ వివాహ సమయంలో సునీతతో పాటు లక్కీని కూడా తీసుకొని వెళ్లాడు. ఈ క్రమంలో అరుణ్ తరుచూ భార్యతో పాపని తన ఇంట్లో వద్దని తరచుగా గొడవ చేశాడు. గత 3నెలల క్రితం పాప అయినా లక్కీని కొట్టి చెయ్యి విరిచాడు. అప్పటి నుంచి పాపని సునీత నిజామాబాద్లో ఉన్న తల్లీ దగ్గరికి పంపించేసింది. అయితే బుధవారం సునీత తన కూతురిని చూడాలని భర్త అరుణ్ కి తెలిపింది. అందుకు అరుణ్ నిజామాబాద్ నుంచి పాపని తీసుకొని ధర్మొరకి వచ్చాడు. పాప లక్కీ నిద్రిస్తున్న సమయంలో తల్లీ సునీత స్నానానికి వెళ్లింది. ఈ క్రమంలో అరుణ్ నిద్రిస్తున్న కూతురిని గొంతు నులిమి హత్య చేశాడని తల్లీ వాపోయిందన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృత దేహాన్ని పరిశీలించారు. అనంతరం మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సతీష్ కుమార్ తెలిపారు.