– బ్యాంకింగ్, రియల్టీ షేర్లు పతనం
– లోక్‌సభ ఎన్నికల ముందు నాలుగు సీజన్లలో నష్టాలు
న్యూఢిల్లీ : దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం భారీగా నష్టపోయింది. సెన్సెక్స్ 667.55 పాయింట్లు, నిఫ్టీ 183.50 పాయింట్లు నష్టపోయాయి. ఆసియా మార్కెట్లలో ప్రతికూలతలతో పాటు మరో ఆరు రోజుల్లో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్న నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరించడంతో స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 667.55 పాయింట్లు నష్టపోయి 74,502.90 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ 183.50 పాయింట్లు కోల్పోయి 22,704 .70 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగు సీజన్లుగా నషా ్టలు చవిచూడడం గమనార్హం .పవర్‌గ్రిడ్, సన్‌ఫార్మా, నెస్లే ఇండియా, ఐటీసీ, భారతీ ఎయిర ్‌టెల్, ఇండస్ అండ్ ఇండ్ బ్యాంక్ షేర్లు లాభపడగా ఎం అండ్ ఎం, టెక్ మహింద్రా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ షేర్లు నష్టపోయాయి. ప్రధానంగా బ్యాం కింగ్, రియల్టీ రంగాలు బాగా నష్టపో యాయి. ఐసీఐసీఐ, యాక్సిస్, హెచ్‌డీఎఫ్‌సీ, ఆర్‌బీఎల్, ఐడీఎఫ్‌సీ ఫస్ట్, కోటక్, ఎస్, ఫెడరల్, ఎస్‌బీఐ బ్యాంకుల షేర్లు నష్టపోయాయి. రియల్టీ రంగానికి సంబంధించి లోధా, ప్రెస్టేజ్, గోద్రెజ్ ప్రాపర్టీస్ భారీగా నష్టపో యాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో రూపాయి విలువ 21 పైసలు తగ్గింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.39 వద్ద స్థిరపడింది.