ఎన్టీఆర్ ముని మనవడు, హరికష్ణ మనవడు, జానకిరామ్ తనయుడు నందమూరి తారక రామారావు చిత్ర సీమలోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ‘న్యూ టాలెంట్ రోర్స్ ఏ’ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. హీరో మహేష్ బాబు బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకుంటూ శుక్రవారం మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ,’ఈ కథని నేను రాసుకున్నాను. దీనికి అర్థవంతమైన మాటలు రాయడానికి సమర్థవంతమైన సాయి మాధవ్ బుర్ర లాంటి మాటల రచయిత కావాలి. ఈ సినిమాతో ఆయనతో పని చేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాకి సంగీతం, సాహిత్యం ప్రాణంగా భావిస్తుంటాను. కీరవాణి యుగపురుషుడు లాంటి వారు. అలాంటి మహానుభావుడితో ఈ సినిమా చేసిన చేయడం చాలా సంతోషంగా ఉంది. చంద్రబోస్ సాహిత్యం మహా అద్భుతంగా ఉండబోతోంది. నేను పరిచయం చేసిన ఎంతో మంది హీరోయిన్స్ స్టార్స్‌గా వెలిగారు. ఈసారి మన తెలుగు అమ్మాయి వీణ రావుని కథానాయికగా పరిచయం చేస్తున్నాం. తను మంచి కూచిపూడి డ్యాన్సర్. ఈ మూవీలో అతిరథ మహారథులు ఇంకెందరో ఉంటారు. అలాగే కొత్త ట్యాలెంట్‌ని కూడా ప్రోత్సహిస్తున్నాం. సోషల్ మీడియా వేదికగా వివరాలు చెబుతాం. మేము చెప్పిన ప్రమాణాలు అనుగుణంగా మీ ట్యాలెంట్స్‌ని మాకు పంపించవచ్చు.దాని నుంచి కొంతమందిని ఎంపిక చేస్తాం’ అని అన్నారు.
‘న్యూ టాలెంట్ రోర్స్ బ్యానర్‌లో వైవిఎస్ చౌదరి, కీరవాణి, చంద్రబోస్ లాంటి మహామహులతో కలిసి పని చేసే అవకాశం ఇచ్చిన నిర్మాత యలమంచిలి గీతకి ధన్యవాదాలు. కథ విన్నాను, చాలా మంచి కథ. బ్యానర్‌లానే ప్రతిబింబించే ప్రతిభ గర్జిస్తే ఎలా ఉంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది. మంచి డైలాగ్స్ రాసే అవకాశం ఉన్న కథ. ప్రాణం పెట్టి ఈ సినిమాకి పని చేస్తాను’ అని డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా చెప్పారు.