భక్తురాలిని కాపాడే అమ్మవారి కథ

”ఆదిపర్వం’ అమ్మవారి కథ, అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ, ఆ భక్తు రాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి సంజీవ్‌ కుమార్‌ మేగోటి దర్శకుడు. రావుల వెంకటేశ్వర్‌ రావు సమర్పణలో అన్వికా ఆర్ట్స్‌ -ఎ.ఐ ఎంటర్టైన్మెంట్స్‌ సంయుక్త నిర్మాణంలో ఐదు భాషల్లో (తెలుగు – కన్నడ – హిందీ – తమిళ – మలయాళ) ఈ సినిమా రూపుదిద్దు కుంది. 1974 నుంచి 1992 మధ్య జరిగే పీరియాడిక్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలోని పాటలు అన్విక ఆడియో ద్వారా విడుదల య్యాయి. సంగీత దర్శకులు ఆర్‌.పి.పట్నాయక్‌, ఎమ్‌.ఎమ్‌. శ్రీలేఖ, రఘు కుంచె, ఘంటాడి క్రిష్ణ ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా హాజరైన పాటలను ఆవిష్కరించారు.
దర్శకుడు సంజీవ్‌ కుమార్‌ మేగోటి మాట్లాడుతూ, ‘బహు భాషల్లో రూపొందిన ఈ చిత్రం ఇంత బాగా రావడానికి మాకు సహకరించిన మంచు లక్ష్మికి ఎప్పటికీ రుణపడి ఉంటాం’ అని చెప్పారు. ఆదిత్య ఓం, ఎస్తర్‌ నోరోనా, శ్రీజిత ఘోష్‌, శివకంఠంనేని, సత్యప్రకాష్‌ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.