సిద్ధార్థ్ హీరోగా శ్రీ గణేష్ దర్శకత్వంలో ఓ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తెరకెక్కుతోంది. ‘మావీరన్’ నిర్మాత అరుణ్ విశ్వ శాంతి టాకీస్‌పై తెలుగు- తమిళంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు కీలక పాత్రలు పోహిస్తున్నారు. గురువారం ఈ చిత్ర ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్‌ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి ‘3 బిహెచ్‌కె’ అనే ఆసక్తికర టైటిల్ పెట్టారు. సిద్ధార్థ్, శరత్‌కుమార్, దేవయాని బ్యూటీఫుల్ ఫ్యామిలీగా కనిపించిన ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై పాజిటీవ్ వైబ్స్ క్రియేట్ చేసింది. ‘ఇది మన ఇంటి కథ ..ఈ ఇంట్లోనే చిన్న చిన్నగా చాలా కథలు ఉన్నాయి. ఇది మసాల డబ్బా కాదు.. అమ్మ గారి చిన్న బ్యాంక్. ఇది నాన్న గారి సెంటిమెంటు బీరువా’ అంటూ సిద్ధార్థ్ వాయిస్‌తో మొదలైన టైటిల్ టీజర్ ఫీల్ గుడ్ మూమెంట్స్‌తో చాలా క్యురియాసిటీని పెంచింది. సిద్ధార్థ్ కూల్ అండ్ చార్మ్ లుక్‌తో ఆకట్టుకున్నారు. శరత్‌కుమార్, దేవయాని, యోగి బాబు ప్రజెన్స్ కూడా అలరించింది. ఫ్యామిలీ ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమా రూపొందుతోందని టీజర్ చూస్తే తెలుస్తోంది. సమ్మర్‌లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. మీఠా రఘునాథ్, చైత్ర తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం: శ్రీ గణేష్, నిర్మాత : అరుణ్ విశ్వ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఆర్.సిబి మారప్పన్, ఫోటోగ్రఫీ డైరెక్టర్: దినేష్ కష్ణన్ బి, జితిన్ స్టానిస్లాస్, సంగీతం: అమత్ రామ్‌నాథ్, ఎడిటర్: గణేష్ శివ, డైలాగ్స్: రాకేందు మౌళి, ఆర్ట్ డైరెక్టర్: వినోద్ రాజ్‌కుమార్ ఎన్.