కిల్లర్స్‌ కథ..

The story of the killers..ఎన్టీఆర్‌ శ్రీను సమర్పణలో జాకీ షరాఫ్‌, సన్నీలియోన్‌, ప్రియమణి, సారా అర్జున్‌ ముఖ్య పాత్రల్లో ఫిల్మ్‌ నటి ప్రొడక్షన్స్‌, వై స్టూడియోస్‌ పై వివేక్‌ కుమార్‌ కన్నన్‌ నిర్మించి, దర్శకత్వం వహించిన సినిమా ‘క్యు జి’. మరో నిర్మాతగా గాయత్రి సురేష్‌ వ్యవహరిం చారు. ఈ సినిమా తెలుగు వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ రైట్స్‌ని రుషికేశ్వర్‌ ఫిలిమ్స్‌ సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా నిర్మాత ఎం. వేణుగోపాల్‌ మాట్లాడుతూ, ‘ఎంతో హెవీ కాంపిటీషన్‌లో కూడా ఈ సినిమా తెలుగు వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌ రైట్స్‌ నాకు ఇచ్చినందుకు తమిళ నిర్మాతలకి థ్యాంక్స్‌. టీజర్‌కి, ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌కి అద్భుతమైన రెస్పాన్స్‌ వస్తోంది. అతి త్వరలో సినిమాని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్‌ చేస్తున్నాం’ అని చెప్పారు. ఈ చిత్రానికి నిర్మాతలు : ఎం.వేణుగోపాల్‌, వివేక్‌ కుమార్‌ కన్నన్‌, గాయత్రి సురేష్‌.