కేంద్ర బీజేపీ ప్రభుత్వ కార్పొరేట్, మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు కార్మికులు, కర్షకులు,కోట్లాది ప్రజానీకం సన్నద్ధమౌతున్నారు. కార్మిక, రైతు, ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాలకై 2024 ఫిబ్రవరి 16న దేశ వ్యాప్తంగా కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్‌కు జాయిం ట్ ప్లాట్‌ఫారమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్, సంయుక్త కిసాన్ మోర్చా పూనుకున్నది. మేము సైతం అంటూ తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, ప్రజా సం ఘాలు బంద్‌కు మద్దతునిచ్చి, ప్రత్యక్షంగా పాల్గొం టామని ప్రకటించాయి. భారతదేశ చరిత్రలోని కార్మి కులు, రైతులు, వ్యవసాయ కూలీలు కలిసి ఉద్య మిస్తున్న అరుదైన ఉద్యమం ఇది. నయా ఉదా రవాద, కార్పొరేట్ మతోన్మాద విధానాల దుష్పలి తాల వల్ల ఇబ్బందులు పడే వర్గాలు ఇప్పటి వరకు విడివిడి పోరాటాలు చేశాయి. ఇతర వర్గాలు సంఘీ భావంగా, మద్దతునిచ్చే దశ నుండి ఐక్య కార్యచరణతో సమరశీల పోరాటాల అభివృద్ధి దిశగా కృషి సాగించడమే ఇందుకు నిద ర్శనం. అయితే తలపెట్టిన ఈ ప్రతిఘటనా ఉద్యమం కేంద్రం లోని కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తూ కార్పొరేట్లకు ప్రజా సంపదను దోచిపెడుతున్న మోడీ ప్రభుత్వానికి ఓ హెచ్చరిక.
కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారానికొచ్చి పదేండ్లకాలం పూర్తైంది. అయినా రైతాంగ, కార్మిక, ఉద్యోగ వర్గాల, ప్రజల సమ స్యలను పరిష్కరించలేదు. భారత్ వెలిగిపోతుంది, అచ్చేదిన్ ఆయేగా, ఆత్మనిర్భర్ భారత్, మేకిన్ ఇండియా వంటి మోసపూ రిత నినాదాలిచ్చినా ఈ పదేండ్ల కాలంలో సామాన్య ప్రజలకు ఒరిగిందేమీ లేదు. కేంద్ర ప్రభుత్వ అర్ధిక విధానాల వల్ల పేద, ధనిక, తారతామ్యాలు తీవ్రమౌతున్నాయి. ఆక్స్‌ఫాం నివేదిక ప్రకారం దేశంలో 139 కోట్ల మంది ప్రజల్లో ఎనభై కోట్ల మంది దారిద్య్రరేఖకు దిగువన మగ్గిపోతున్నారు. వాటి దుష్పలితాల వల్ల నిరుద్యోగం దారిద్య్రం పెరుగుతుంది. కనీస వేతనం ధరలకు అనుగుణంగా పెరగకపోవడం వల్ల కొనుగోలు శక్తి క్షీణిస్తుంది. శ్రామికుల నిజ వేతనాలు ఇరవై శాతం తగ్గిపోయాయి. బీజేపీ నరేంద్రమోడీ విధానాల వల్ల కార్పొరేట్ సంస్థల లాభాలు గరిష్ట స్థాయికి చేరాయి. 2019-2022 మధ్యకాలంలో ఒక శాతంగా ఉన్న బడా కార్పొరేట్ల వాస్తవ ఆదాయం 30 శాతం అభిóవృద్ధి చెందగా, పేదల వాస్తవ ఆదాయం పదకొండు శాతానికి పడి పోయింది. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి యేటా రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీనిచ్చారు. కానీ నేడు ఉద్యోగ కల్పన క్షీణించి నిరుద్యోగం గత యాభై ఏండ్ల గరిష్ట స్థాయికి చేరింది.
స్విస్ బ్యాంకుల్లో నుండి నల్లధనాన్ని వెనక్కి తెచ్చి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15 లక్షలు డిపాజిట్ చేస్తా మన్న మాటను చునావీ జుమ్లా అన్నారు. 2023లో పాలకులు కార్పొరేట్లకు 2.14 లక్షల కోట్ల బ్యాంకు రుణా లను మాఫీ చేశారు.మోడీ విధానాల వల్ల మధ్య తరగతి ప్రజల జీవితాలు భారంగా మారాయి. ధరల్ని నియం త్రిస్తామని వాగ్ధానం చేసిన బీజేపీ ప్రభుత్వ హయాం లోనే ధరలు కనీవినీ ఎరుగని రీతిలో 30 నుండి 56 శాతం వరకు పెరిగాయి. పెట్రోలు ఉత్పత్తులపై కేంద్ర ప్రభుత్వం పన్నుల వాటాను 243 శాతానికి పెంచింది.
ప్రభుత్వరంగ సంస్థలు, సహజ వనరులను కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ల పరం చేస్తు న్నది. వ్యూహాత్మక అమ్మకాల పేరుతో ప్రభుత్వరంగ సంస్థలను తెగనమ్ము తున్నది. నేషనల్ మానిటైజేషన్ పైప్‌లైన్ (ఎన్‌ఎంపి) పాలసీ ద్వారా మౌలిక వసతులను లీజు పేరుతో ప్రయివేటీకరిస్తున్నది. ఉద్యోగుల కష్టార్జితమైన పిఎఫ్, పెన్షన్ నిధు లను ప్రయివేటు ఇన్సూరెన్స్, మ్యూ చువల్ ఫండ్ సంస్థలకు కట్టబెడు తున్నది. సింగరేణిలోని 4 బొగ్గు బ్లాకులను వేలం వేయడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నది. కార్మికులు, మధ్యతరగతి ప్రజల్లో అత్యధికులు పాలసీదార్లుగా వున్న ఎల్‌ఐసి వాటాలను అమ్మేం దుకు తెగబడింది. కార్పొరేట్లు ఎగ్గొట్టిన రుణాలతో ప్రభుత్వరంగ బ్యాంకులను నిర్వీర్యం చేస్తున్నది. ఈ విధానాలు ఉద్యోగుల భద్రతతో పాటు దేశ ఆర్ధిక స్వావలంబనకే ముప్పు తెస్తున్నాయి.
రిలయన్స్ వంటి కార్పొరేట్ సంస్ధల ప్రయోజనాల కోసం అనేక త్యాగాలతో పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్ లను తెచ్చింది. కనీస వేతనాలు నిర్ణయించే విధానానికి స్వస్తి పలికింది. సమ్మె హక్కును కాలరాస్తున్నది. పిఎఫ్, ఇఎస్‌ఐ, వెల్ఫేర్ బోర్డులను నిర్వీర్యం చేస్తున్నది. ఎనిమిది గంటల పని దినం స్ధానంలో తిరిగి 12గంటల పని విధానం అమల్లోకి తెస్తు న్నది. కాంట్రాక్టు లేబర్ విధానం అన్ని రంగాల్లో మరింత పెంచి శ్రమదోపిడీకి గురి చేస్తున్నది. కనీస వేతనం నెలకు రూ.26వేలు నిర్ణయించేందుకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం అంగీకరించటం లేదు. కోట్లాది మంది కార్మికులకు వర్తించే ఇపిఎస్‌ను నెలకు రూ.10 వేలకు పెంపు, పాత పెన్షన్ (ఓపిఎస్) స్కీం పునరుద్ధరణకు పూనుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వో ద్యోగులకు 8వ పే కమి షన్‌ను నియమించకుండా జాప్యం చేయడం, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయకపోవడాన్ని కార్మికవర్గం నిరసిస్తున్నది.
2014లో స్వామినాథన్ కమిషన్ సిఫారసుల మేరకు రైతు లు పండించిన పంటకు ఎంఎస్‌పి (మినిమం సపోర్ట్ ప్రైస్) చెల్లి స్తామన్న హామీని బీజేపీ ప్రభుత్వం నిలబట్టుకోలేదు. చారిత్మ్రాక మైన రైతాంగ పోరాట ఫలితంగా మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరిస్తూ కేంద్ర ప్రభుత్వం రైతులకు రాతపూర్వక హామీ ల్చింది. ఈ కాలంలో వాటిని అమలు చేయకపోగా వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ సంస్ధలు టాటా, బిర్లా, అదానీ, రిలయన్స్, ఐటిసి, బేయర్ లాంటి సంస్ధలకు కట్టబెట్టింది. వ్యవసాయోత్ప త్తులను తగ్గించి ఏటా రూ. 4లక్షల కోట్ల విలువగల నూనెలు, పప్పులు తదితర పంటలను దిగుమతులు చేసుకుంటున్నారు. కార్పొరేట్లకు మరిన్ని లాభాలు చేకూర్చేందుకు మోడీ ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నది. రైతులపై పెట్టిన కేసులు ఉపసహరించుకోలేదు. పోరాట సందర్భంగా చనిపోయిన 750 మంది రైతు కుటుంబాలకు పరిహారం చెల్లించలేదు. కేరళ తరహా రుణవిమోచన చట్టం తీసుకురావాలని, అన్ని బ్యాంకింగ్ సంస్థల నుండి ఒకేసారి రుణమాఫీ చేయాలని, విద్యుత్ (సవరణ) బిల్లు ద్వారా విద్యుత్ రంగ ప్రయివేటీకరణ నిలుపుదల చేయాలని కౌలు రైతులకు రక్షణ చర్యలు తీసుకోవాలని సుదీర్ఘ కాలంగా రైతాంగం చేస్తున్న డిమాండ్ పట్ల బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లో కొద్దోగొప్పో ఉపాధి కల్పనకు సుదీర్ఘ ప్రజా పోరాటాలు పార్లమెంట్‌లో వామపక్షాల కృషి వల్ల ఉపాధి హామీ పథకం వచ్చింది. ఈ పథకాన్ని ఎత్తివేయా లని బీజేపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది.ఈ పథ కానికి బడ్జెట్ తగ్గించేసింది. ఉపాధి హామీ పథ కాన్ని పట్టణాలకు విస్తరించేందుకు నిరాకరిస్తున్నది. ప్రతి వ్యక్తికి 200 రోజుల పని, రూ.600లు రోజు వారీ వేతనం ఇవ్వాలన్న డిమాండ్‌ను ఖాతరు చేయడం లేదు. పేదవాడి నోటికాడి బువ్వలాగే ప్రయత్నం చేస్తున్నది.
కార్పొరేట్ అనుకూల, నయా ఉదారవాద ఎజెండాను దూకుడుగా ముందుకు తీసుకెళ్తూనే కార్పొరేట్, మతోన్మాద శక్తుల వైఫల్యాలు, ప్రజల రోజువారీ సమస్యలను దృష్టి మళ్లించేందుకు బరితెంగించింది. రామాలయ నిర్మాణం, ప్రాణ ప్రతిష్ట, అక్షింతల పంపిణీ పేర్లతో భావోద్వేగా లను రెచ్చగొట్టి కార్మికవర్గ ఐక్యతకు భంగం కల్గిస్తున్నది. ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉపయోగించి తమకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతిపక్షాలను, ఉద్యమకారులను అణిచివేస్తున్నది. సిబిఐ, ఈడీ, ఐటి వంటి సంస్థలను వారి జేబు సంస్థలుగా ఉపయోగించుకొని వాటి స్వయం ప్రతిపత్తిని దెబ్బ తీస్తున్నది. ప్రశ్నించే మీడియాను లొంగదీసుకుని అణచివేస్తున్నది. హక్కులకై పోరాడే వారిపై నిర్భంధం ప్రయోగిస్తూ ఉపా లాంటి చట్టాలను ప్రయోగించి నిర్భంద పాలన సాగిస్తున్నది. ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నది.
దేశంలో పెట్టుబడిదారి విధానం తీవ్ర సంక్షోభంలోకి చేరు కుంది. పెట్టుబడిదారులు పాలకవర్గాలు ఈ సంక్షోభం నుండి బయటపడాలంటే కార్మిక వర్గ హక్కులు, సంక్షేమాలకు కోతలు పెట్టడం అనివార్యం. ప్రజలపై భారాలు మోపడం సహజం. వీరికి ఇవి తప్ప మరో మార్గం లేదు. దీనిని కోసం కార్మిక చట్టాల రద్దు, పని భారాలు పెంచడం, వేతనాలు పెరగన్వికుండా చేయ డం, రైతాంగాన్ని దివాళ తీయించడం వంటి చర్యలు తీసు కోవడం అనివార్యం. ఈ కోణంలోనే కార్పోరేట్, మతోన్మాద శక్తు లకు కేంద్ర బీజేపీ ప్రభుత్వం ఊడిగం చేస్తున్నది. కార్మిక వర్గం గత హక్కులను నిలుబెట్టుకోవాలన్న ప్రస్తుతం పొందుతున్న సౌకర్యాలు దిగజారకుండా ఉండాలన్న కేంద్ర బీజేపీ కార్పోరేట్ మతతత్వ విధానాలను ప్రతిఘటించడమే పరిష్కార మార్గం. ఈ విధానాల వల్ల నష్టపోయే సమస్త శ్రామిక వర్గాన్ని ఐక్యం చేసి పోరాటాలను ఉధృతం చేయాలి. అందులో భాగమే 2024 పిబ్ర వరి 16 దేశ వ్యాప్త కార్మికుల సమ్మె-గ్రామీణ భారత్ బంద్ పిలుపు. కొనసాగింపుగా 2024లో జరగబోయే పార్ల మెంట్ ఎన్నికల్లో కార్పోరేట్, అవినీతికర మతోన్మాద బీజేపీని ఓడించ డమే లక్ష్యంగా కృషి కొనసాగాలి. అందుకు కార్మికుల, కర్షకులు, సామాన్య ప్రజానీకం తమ రాజకీయా అనుబంధాలకు అతీతం గా దేశ విశాల ప్రయోజనాల కోసం ఐక్య పోరుకు సిద్ధపడాలి.
పాలడుగు భాస్కర్
9490098033