16న దేశ వ్యాప్తంగా సమ్మె ను విజయవంతం చేయాలి

నవతెలంగాణ – డిచ్ పల్లి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్, మతతత్వ విధానాలను ధిక్కరిస్తూ ప్రతిఘటనకు పూనుకోవాలని, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై చార్జిషీట్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16 న దేశవ్యాప్త కార్మికుల సమ్మె – గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని భారత ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా అఖిల భారత స్థాయిలో నిర్ణయించారని దానిలో భాగంగానే తెలంగాణ గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ నిజామాబాద్ జిల్లా ఐఎఫ్టియు అద్యక్ష, కార్యదర్శి ఎం.డి. కాజా మొయినుద్దీన్, జె.పీ. గంగాధర్ ఆధ్వర్యంలో డిచ్ పల్లి మండల కేంద్రంలో సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  తెలంగాణ రాష్ట్ర కార్మికుల సమ్మె – గ్రామీణ బంద్ ను విజయవంతం చేయాలని జిల్లా కమిటీలో తీర్మానించమని,కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని, కార్మికులకు సుప్రీంకోర్టు నిర్ణయించిన విధంగా వేతనాలు చెల్లించాలని, పి.ఎఫ్, ఈ.ఎస్.ఐ పథకాలను అమలు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు నిజామాబాద్ జిల్లా కమిటీ కోశాధికారి సుధాకర్, సహాయ కార్యదర్శి నర్మల శాంసన్, సభ్యులు ఎన్.లక్ష్మణ్, డి.మోహన్ తదితరులు పాల్గొన్నారు.