
మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆశావర్కర్లు నిరసన చేపట్టి, తహశీల్దార్లు వినతి పత్రాన్ని శుక్రవారం అందజేశారు. మానిక్ బండారు 63వ జాతీయ రహదారి వద్ద అటో యూనియన్ అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి కొండ గంగాధర్ మాట్లాడుతూ కేంద్రం ప్రభుత్వం విధానాలకు వ్యతిరేకంగా దేశ వ్యాప్త కార్మికుల సమ్మె, గ్రామీణ భారత్ బంద్ ను విజయవంతం అయిందన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, సామాన్య ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుకొంటున్నరని అన్నారు. నాలుగు లివర్ కోడ్ లను, విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని, ప్రజా పంపిణీ వ్యవస్థను బలోపేతం చేయాలని, కాంట్రాక్ట్ విధానం రద్దు చేసి కార్మికులను పర్మినెంట్ చేయాలని, కనీస వేతనం రూ. 26 వెలు నిర్ణయించి అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, ఎఐటియుసి నాయకులు, ఆశావర్కర్లు, అటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు.