ప్రభుత్వం మా సమస్య పరిష్కరించే వరకు సమ్మె విరమించం

నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
మండలంలోని అన్ని గ్రామాలకు చెందిన అంగన్వాడీ టీచర్స్, హెల్పర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత13రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడం దయనీయకరం. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలని, 26 వేల జీతం, పెన్షన్, ఉద్యోగ భద్రత, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని, ప్రమాద బీమా ఐదు లక్షలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీటీచర్లు,పద్మ,జ్యోతి,వనజ,కమల,అంగన్వాడి ఆయాలు పాల్గొన్నారు.