నవతెలంగాణ – చండూరు
మున్సిపల్ కార్మికుల జీతాలు చెల్లించే వరకు సమ్మె విరమించేది లేదు అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి అన్నారు. శుక్రవారం చండూరు మండల కేంద్రంలో చండూర్ మున్సిపల్ కార్మికుల సమ్మె ఐదవ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత బిఆర్ఎస్ ప్రభుత్వం పెంచిన వేతనాలు అమలు చేయకపోవడం వలన కార్మికులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులకు కనీస వేతనం రూ.26,000 ఇవ్వాలనిఆయన అన్నారు. సీఐటీయూ పోరాటాల ఫలితంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు వెయ్యి రూపాయలు పెంచి ఇంతవరకు అమలు చేయడం లేదని ఆయన అన్నారు. చండూరు మున్సిపాలిటీలో జీతభత్యాలు కోటి నాలుగు లక్షలు అవుతున్నాయని, దీనికి సరిపడా బడ్జెట్ కు కేటాయింపులు లేవని, అందుకు చండూరు పాలకవర్గం, అధికారులు ఈలోపు సరిదిద్దుకోనే చర్యలు తీసుకోని కార్మికులను ఆదుకోవాలని అన్నారు. మున్సిపల్ కార్మికులకు వీక్లీ ఆఫ్ అమలు జరపాలని, గత నాలుగు మాసాల నుండికార్మికులకువేతనాలు లేకపోవడంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజు పారిశుద్ధ్యంను క్లీన్ చేస్తున్న సిబ్బందికి వేతనాలుఇవ్వకపోవడం వలన కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన అన్నారు. పారిశుద్ధ్యం శుభ్రం చేస్తున్న వారిలోఅత్యధికంగా దళితులు, వెనుకబడిన తరగతులు వారు కాబట్టి నెల నెల జీతాలు చెల్లించే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన అన్నారు.
పిఎఫ్, ఈఎస్ఐ తొమ్మిది మాసాల నుండి కట్టకపోవడం వలన అధికారుల నిర్లక్ష్యం కారణంగా కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందని వారు తెలిపారు. జీవో నెంబర్1037లో ప్రతిపాదించిన మున్సిపాలిటీలలో కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ సేవలను థర్డ్ పార్టీకి అప్పజెప్పాలని నిర్ణయాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. పారిశుద్ధ్య సేవలో ప్రైవేటీకరణ చర్యలు ఉపసంహరించుకోవాలని రామ్కీ తదితర ప్రైవేట్ సంస్థలతో చేసుకున్న ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలనిడిమాండ్ చేశారు.కార్మికులకుపాత కార్మికులతో సమానంగా వేతనాలు పిఎఫ్ ఎస్ఐ అమలు చేయాలని ఆయన అన్నారు. ప్రమాదాల్లో మరణిస్తున్న కార్మికులకు 25 లక్షల ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రవేశపెట్టాలని, దహన సంస్కారాలకు రూ.30000 రూపాయలుఇవ్వాలని డిమాండ్ చేశారు. వయసు మీరిన అనారోగ్యం కారణంగా రిటర్మెంట్ అయిన కార్మికుడికి ఐదు లక్షలు ఇవ్వాలని వారి కుటుంబంలోని వారసులకు అదే ఉద్యోగం కల్పించాలనివారు కోరారు.మున్సిపల్ కార్మికులందరికీమొదటి ప్రాధాన్యతగా ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల ను ఇంటి స్థలాన్ని కేటాయించాలని ఆయన ప్రభుత్వానికోరారు.కాంగ్రెస్ ప్రభుత్వంఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా మున్సిపల్ కార్మికుల సమస్యలపరిష్కారానికితక్షణమే చర్యలు చేపట్టాలని అన్నారు.అనారోగ్యానికి ఈఎస్ఐ వర్తించకపోవడంతో కార్మికులకు ఎక్కువగా నష్టం జరిగే ప్రమాదం ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటిశంకర్, సీఐటీయూ జిల్లాసహాయ కార్యదర్శిఏర్పుల యాదయ్య, కెవిపిఎస్ జిల్లా ఉపాధ్యక్షులుబొట్టు శివకుమార్, సీఐటీయూ జిల్లా నాయకులు మోగుదాల వెంకటేశం, సీఐటీయూ సీనియర్ నాయకులుచిట్టి మల్ల లింగయ్య,సీఐటీయూ చండూరు మండల కన్వీనర్ జెర్రిపోతుల ధనంజయ గౌడ్, తెలంగాణమున్సిపల్, వర్కర్స్అండ్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శికత్తుల సైదులు, ఉపాధ్యక్షులునల్లగంటి లింగస్వామి,నాగరాజు,చంద్రయ్య, రవమ్మ, కలమ్మ, అలివేలు, రజిత, ఎల్లమ్మ, బక్కమ్మ, దానయ్య, యాదయ్య, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.