
గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె ఆగదని గ్రామపంచాయతీ కార్మికులు తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా గురువారం భిక్కనూర్ పట్టణంలో గ్రామపంచాయతీ కార్మికులు సమ్మె ప్రారంభించారు. పంచాయతీ సిబ్బందిని పర్మనెంట్ చేయాలని, కారోబార్లకు స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మె కార్యక్రమంలో మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల కార్మికులు పాల్గొన్నారు.