విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ ‘తంగలాన్’. ఈ చిత్రాన్ని దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్ పై నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధా రంగా ఈ సినిమా తెరకెక్కింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ నెల 15న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు ఈ సినిమా రాబోతోంది. తెలుగులో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూషన్ రిలీజ్ చేస్తోంది. హీరో విక్రమ్ మాట్లాడుతూ, ‘పా రంజిత్ నా ఫేవరేట్ డైరెక్టర్. ఆయన తీసిన ప్రతి సినిమా నాకు ఇష్టం. ఆయన ఈ కథ నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీలయ్యా. ఇది తెలుగు, తమిళ, కన్నడ అని కాదు ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే స్టోరీ. బంగారం వేట అనేది హైలెట్ అవుతున్నా..ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. థియేటర్‌లో మిమ్మల్ని ఈ సినిమా సర్‌ప్రైజ్ చేస్తుంది’ అని అన్నారు.