నవతెలంగాణ-భైంసా : కార్గిల్ వీరుల పోరాటం అమోఘమని బైంసా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ బాబు, బిజెపి పట్టణ అధ్యక్షులు మల్లేష్అన్నారు. శుక్రవారంపట్టణంలోని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో కార్గిల్ విజయ్ దివస్ ను పురస్కరించుకొని యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరులకు నివాళులు అర్పించిన సందర్భంగా మాట్లాడారు. కార్గిల్ పోరాటానికి నేటితో 25 ఏళ్లు నిండాయన్నారు. వారి బాటలో ప్రతి ఒక్కరి పయనించి దేశభక్తిని పెంపొందించుకోవాలన్నారు కార్యక్రమంలో బిజెపి నియోజకవర్గ నాయకులు నారాయణరెడ్డి, పట్టణ నాయకులు గాలి రాజు, ప్రవీన్, మాణిక్ తో పాటు పలువురు పాల్గొన్నారు.