గవర్నర్ చేతుల మీదుగా బహుమతి అందుకున్న విద్యార్థిని

నవతెలంగాణ – ఆర్మూర్  
మండలంలోని చేపూరు గ్రామ శివారు క్షత్రియ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని గవర్నర్ చేతుల మీదుగా అవార్డు అందుకున్నట్టు విద్యా సంస్థల చైర్మన్ అల్జాపూర్ శ్రీనివాస్,, కార్యదర్శి దేవేందర్ లు శనివారం తెలిపారు. జే ఎన్ టి యు హె వారు  నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీ సామాజిక ఆర్థిక అసమానతలు – జాతీయ విద్యా విధానం 2020 అనే అంశం పై నిర్వహించడం జరిగింది ఈ పోటీలో అన్ని జిల్లాల నుంచి ప్రతి కళాశాల నుండి సుమారు  100 మంది NSS విద్యార్థులు పాల్గొన్నారు.గెలుపొందినవారికి JNTUH క్యాంపస్ లో గవర్నర్ తమిళ సై చేతుల మీదుగా నగదు రూపంలో 5000 రూపాయలు బహుమతి ప్రదానం చేయడం జరిగింది ఈ పోటీలో క్షత్రియ ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థిని ఆంగ్ల మాధ్యమం కేటగిరీ లో ప్రథమ బహుమతి పొందింది. విద్యార్థిని పేరు గోమకుల లౌకిక కంప్యూటర్ సైన్స్ ప్రథమ సంవత్సరం చదువుతుంది. ఆమె  తల్లి గొమకుల లత తండ్రి గో మకుల భుమేశ్వర్, ఈయన ఎల్ఐసి ఏజెంట్ గా ఆర్మూర్ దగ్గర అందాపుర్ గ్రామం లో విధులను నిర్వహిస్తున్నారు. తమ కూతురు రాష్ట్ర స్థాయి వ్యాసరచన పోటీ లో గెలుపొందడం చాలా సంతోషకరం అని తెలిపారు. లౌకిక చిన్నప్పటి నుండీ చాలా ప్రతిభావంతురాలు అని ఆయన అన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే పాండే, కళాశాల కార్యదర్శి అల్జాపూర్ దేవేందర్ తదితరుల అభినందించారు