బగ్గు మంటున్న ఎండలు హడలెత్తిపోతున్న పాఠశాలల విద్యార్థులు, జనాలు,

నవతెలంగాణ – మద్నూర్
జూన్ మాసం మూడో వారానికి చేరుకుంటున్నప్పటికీ ఎండలు దంచి కొడుతూ.. బగ్గుమంటున్నాయి భారీ ఎండలకు పాఠశాలలకు వెళ్లే విద్యార్థిని విద్యార్థులు జనాలు హడలెత్తిపోతున్నారు బగ్గు మంటున్న ఎండలకు జనాలు గాని విద్యార్థిని విద్యార్థులు గాని అడలెత్తిపోతున్న దానిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు మరికొన్ని రోజులు సెలవులు ప్రకటిస్తే బాగుంటుందేమోనని విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఎక్కడ చూసినా చర్చించుకుంటూ ఆవేదన వ్యక్తం అవుతుంది. వర్షాలు కురిసి వేడి తగ్గే వరకు మరికొన్ని రోజులు పాఠశాలలు సెలవులు ప్రకటిస్తే బగ్గు మంటున్న ఎండలతో విద్యార్థిని విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటారని ఎండ దెబ్బకు అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉన్నందున తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం అవుతుంది ఇంట్లో కూలర్ల ముందుగానే ఫ్యాన్ల కింద గాని కూర్చుంటే భగ్గుమంటున్న ఎండలకు జనాలంతా అడలెత్తిపోతున్నారు. వర్షాకాలం ప్రారంభమై వారం పది రోజులు గడిచిన చుక్క వర్షం పడకపోవడం ఎండాకాలం లాగే ఎండలు బగ్గుమంటున్నాయి. వారం పది రోజులుగా ఎండ దెబ్బ ప్రజలకు పరేషాన్ చేస్తోంది ఎక్కడికి వెళ్లాలన్నా ఇంట్లో కూలర్ల ముందు కూర్చున్న మనసు పట్టని పరిస్థితి నెలకొంది ఇలాంటి ఎండాకాలం ప్రజలకు వడదెబ్బకు గురై అవకాశం ఉన్నందున ప్రభుత్వం పాఠశాలల మరికొన్ని రోజులు సెలవులు ప్రకటించడంలో ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజల్లో ఆవేదన వ్యక్తం అవుతుంది.