– ప్రొఫెసర్ డా. బి లావణ్య ఉస్మానియా యూనివర్సిటీ
నవతెలంగాణ – భిక్కనూర్
విద్యార్థులకు మంచి భవిష్యత్తు చరిత్ర అధ్యయనం ద్వారానే సాధ్యమవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ బి. లావణ్య అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం దక్షిణ ప్రాంగణంలో గల పీజీ చరిత్ర విద్యార్థులకు ప్రత్యేక ఉపన్యాసం ఇవ్వడానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, చరిత్ర అంటే గతం మాత్రమే కాదని వర్తమాన భవిష్యత్తు అంశాలకు సంబంధించిన అధ్యయనంగా దానిని పరిగణించాలని అన్నారు. విద్యార్థులకు చరిత్రకు సంబంధించిన పలు అంశాలపై, భవిష్యత్తులో ఉపాధి అవకాశాలపై ఆమె తన ఉపన్యాసం ద్వారా తెలిపారు. చరిత్రలో జాతీయవాద, మార్క్సిస్ట్, విశ్లేషణాత్మక, సబాల్టర్న్ వంటి వివిధ విధానాలు, చరిత్రను వ్రాయడంలో మెథడాలజీ, గత చరిత్రను చదవడం మంచి భవిష్యత్తును నిర్మించడంలో ఎలా సహాయపడుతుంది, చరిత్ర మనల్ని ఎలా మంచి మనిషిగా చేస్తుంది. మహిళల చరిత్ర అధ్యయనం యొక్క ప్రాముఖ్యతను గురించి వివరించారు. చరిత్ర అధ్యయనం దేశ, రాష్ట్ర ఉద్యోగ నియామకాలలో, ఆర్కియాలజీస్టులుగా రాణించడానికి ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చరిత్ర విభాగాధిపతి డా. రాజేశ్వరి, అధ్యాపకుడు రమేష్, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారు.