బాధితులకు భరోసా కల్పించిన సబ్ కలెక్టర్

The Sub Collector assured the victims– విద్యార్థిని తల్లిదండ్రులకు ఓదార్పు..
నవతెలంగాణ – వార్తకు స్పందన
నవతెలంగాణ – నసురుల్లాబాద్
నసురుల్లాబాద్ మండలం నాచుపల్లి గ్రామంలో మంగళవారం కురిసిన భారీ వర్షానికి పిడుగుపాటుకు విద్యుత్ ఘాతంతో మృతి చెందిన స్వాతి అనే విద్యార్థి కుటుంబ సభ్యులను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరామర్శించారు. గురువారం నవతెలంగాణ పత్రికలో (బాధితులకు భరోసా ఏది?) అంటూ వార్త ప్రచురితం కావడంతో స్పందించిన బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి నాచుపల్లిలో పిడుగుపాటుకు విద్యుత్ ఘాతంతో మృతి చెందిన విద్యార్థిని స్వాతి ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యాన్ని ఇచ్చారు. తమ ఇంటికి సబ్ కలెక్టర్ రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. చేతికి ందిన కూతురు మృతి చెందింది అంటూ కన్నీరు పెట్టారు. విద్యుత్ ఘాతంతో మృతి చెందిన బాలికను తీసుకురాలేమని మీరు ధైర్యంగా ఉండి మరో కూతురును మంచి జరిపించాలని సూచించారు. పూర్తి వివరాలు పంపిస్తే ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తానన్నారు. విద్యుత్ అధికారులతో మాట్లాడి సాయం అందేలా చూస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థిని స్వాతి మృతి ఎలా జరిగిందంటూ అడిగి తెలుసుకున్నారు విద్యుత్ అధికారులు గ్రామాల్లో తిరుగుతూ విద్యుత్ వైర్లు ఇంటిపై పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు వర్షాల్లో తరచు ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని ఆమె అన్నారు. ఇటువంటి సంఘటన జరగకుండా విద్యుత్ అధికారులు, సిబ్బంది తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో పొదుపు పట్ల అవగాహన కల్పించాలని ఇలాంటి ప్రమాదవశాత్తు సంఘటనలు జరిగినప్పుడు సంఘాలు వెన్నుదన్నుగా ఉంటాయన్నారు. ఐకెపి అధికారులు సిబ్బంది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రతి మహిళ నుంచి పొదుపు చేయడం నేర్పాలన్నారు. వీరి వెంట తహశీల్దార్ ప్రణయ్ కుమార్ నాయక్ తహాశీల్దార్ భవయ్య ఇంచార్జ్ , అర్ఐ హాన్మండ్లు, ఎంపీడీవో సూర్యకాంత్, మాజీ సర్పంచ్ భర్త మంగలి సాయిలు తదితరులు పాల్గొన్నారు.