నూతనంగా ఏర్పడిన డోంగ్లి మండల పరిధిలో కొనసాగుతున్న ప్రభుత్వ మద్దతు ధర వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను అలాగే ఆ మండలంలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటా కుటుంబ సర్వేలను బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి పరిశీలించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు చేపట్టాలని, మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగే కొనుగోలు కేంద్రం దారులకు డోంగ్లి పిఎసిఎస్ ఆధ్వర్యంలో జరిగే కొనుగోలు కేంద్రం అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. ఆ మండలంలోని కుర్లా గ్రామంలో ఇంటింటా సమగ్ర సర్వేను పరిశీలించారు, డోమిలి మండల తాసిల్దార్ రేణుక చౌవాన్ మద్నూర్ ఉమ్మడి మండల ఎంపీడీవో రాణి ఇతర అధికారులు కొనుగోలు కేంద్రాల సిబ్బంది సమగ్ర సర్వే అధికారులు పాల్గొన్నారు.