జినుగు జనుము సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి

నవతెలంగాణ – పెద్దకొడప్ గల్

మండల కేంద్రంలోనీ సహకార సంఘం లో సోమవారం రోజున  రైతులకు జిలుగు విత్తనాలు    ఏఈఓమాధవిపంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతులకు వ్యవసాయ శాఖ ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పై జిలుగు విత్తనాలను ఇవ్వడము జరుగుతుందని, జిలుగు 30 కిలోల బస్తకు ధర 2790/- సబ్సిడీ1674/- కానీ రైతు రూ.1116/-చెల్లించి, ఆధార్ కార్డు, పాస్ పుస్తకం జిరక్స్ తీసుకొని రావాలని,2.20 ఎకరాకు ఒక బస్తా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.రైతులందరూ ఈ సబ్సిడీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలోసీఈవో సందీప్,రమేష్,మారుతి,బస్వంత్, నర్సింలు, రైతులు తదితరులు పాల్గొన్నారు.