రామ్ కార్తీక్, కశ్వి జంటగా నటించిన చిత్రం ‘వీక్షణం’. ఇటీవల విడుదలైన ఈ చిత్రానికి విశేష ప్రేక్షకాదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన థ్యాంక్స్‌మీట్‌లో డైరెక్టర్ మనోజ్ పల్లేటి మాట్లాడుతూ, ‘చాలా హ్యాపీగా ఉంది. సక్సెస్ అవుతుందని తెలుసు, కానీ ఈ రేంజ్ సక్సెస్ చూసి చాలా సంతోషంగా ఉంది. ప్రీమియర్ షో దగ్గర నుంచి ఈ రోజు వరకు ఇదే రెస్పాన్స్ వస్తోంది. థియేటర్‌కి వచ్చి మూవీ చూసి మా సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికీ చాలా పెద్ద థ్యాంక్స్’ అని తెలిపారు. ‘మా సినిమాను ఇంతలా జనాల్లోకి తీసుకువెళ్లిన మీడియా వాళ్లకు, సినిమాను చూసి ఆదరించిన ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా మంచి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. నేను కూడా నిన్న కొన్ని థియేటర్స్‌కి వెళ్లాను. అక్కడ అంతా చాలా పాజిటివ్‌గా ఉంది’ అని హీరో రామ్ కార్తీక్ చెప్పారు.
మ్యూజిక్ డైరెక్టర్ సమర్థ్ గొల్లపూడి మాట్లాడుతూ, ‘ రివ్యూస్ చాలా బాగా వచ్చాయి. చాల హ్యాపీగా ఉంది. సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని తెలిపారు. నటుడు శ్రీరామ్ మాట్లాడుతూ, ‘ఇది నా ఫస్ట్ సినిమా. నా మొదటి సినిమాకే ఇంతమంది ప్రేమ దొరకడం చాలా హ్యాపీగా ఉంది. నన్ను ఈ పాత్రకు సెలెక్ట్ చేసిన డైరెక్టర్ మనోజ్‌కి ఋణపడి ఉంటా’ అని అన్నారు. ‘ప్రేక్షకులందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్. నేను ఈ పాత్ర చేయగలను అని నమ్మి, అవకాశం ఇచ్చిన దర్శకుడు మనోజ్‌కి ధన్యవాదాలు. ఆయన నమ్మకాన్ని నిలబెట్టడం ఆనందంగా ఉంది’ అని చెప్పారు.