– పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం జాయింట్ సమావేశం పెట్టాలి : వంగూరు రాములు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
వీఆర్‌ఏ వారసులకు ఉద్యోగాలివ్వాలనీ, ఇతర పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ సమావేశం నిర్వహించాలని వీఆర్‌ఏ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగూరు రాములు కోరారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. వీఆర్‌ఏలందరికీ ఐడీ కార్డులు జారీ చేయాలనీ, నాలుగు నెలల వేతన బకాయిలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. మరణించిన వీఆర్‌ఏల కుటుంబాలను ఆదుకోవాలని విన్నవించారు. ఇతర జిల్లాలకు పంపిన వీఆర్‌ఏలను సొంత జిల్లాల్లో పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. వీఆర్‌ఏలుగానే కొనసాగించాలని జేఏసీ పేరుతో కొన్ని పత్రికల్లో వచ్చిన ప్రకటనను ఖండించారు. అది కొందరు వ్యక్తులు ఇచ్చిన ప్రకటన అని తెలిపారు.