విద్యార్థిని ఆత్మహత్య కాదు, హత్య నే.?

నవతెలంగాణ – రామారెడ్డి
మండల కేంద్రానికి చెందిన కోదండ భారతి శుక్రవారం ఆత్మహత్య చేసుకుందని పేర్కొనడం అసత్యమని, అది ముమ్మాటికి హత్య అని అఖిల భారత విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ మంగళవారం ఆరోపించారు. స్థానిక బాలుర జిల్లా పరిషత్ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న భారతి మృతి చెందడం బాధాకరమని, మంగళవారం పాఠశాలలో మృతికి సంతాపాన్ని ప్రకటించి, మౌనం పాటించారు. భారతి ఆత్మహత్య కాదని, అత్యానేనని తండ్రి, కుటుంబ సభ్యులు హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించారని జిల్లా కన్వీనర్ చరణ్ ఆరోపిస్తూ స్థానిక ఎస్సై కొండ విజయ్ కు పిటిషన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులు ఖలీల్, రోహిత్, కళ్యాణ్, వెంకీ, అల్తాఫ్, మురళి తదితరులు ఉన్నారు.