నిజామాబాద్ జిల్లాలో దంచి కొడుతున్న ఎండలు

నవతెలంగాణ కంఠేశ్వర్:  నిజామాబాద్ జిల్లాలో ఎండలు దంచి కొడుతున్నాయి. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వద్దామంటే ఎండ.. ఇంట్లో ఉంటే ఉక్కపోతతో అవస్థలు పడుతున్నారు. బుధవారం నిజామాబాద్ జిల్లాలో 41.5/30.0  డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది చీఫ్ ప్లానింగ్ అధికారి కార్యాలయం నుండి అలాగే వాతావరణ శాఖ అధికారులు నుండి విడుదలైంది. అత్యవసరమైతే బయటకు వచ్చిన సమయాల్లో ఎండ నుంచి రక్షణ పొందేందుకు గొడుగులు, టవళ్లు, టోపీలను కొనుగోలుచేస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.