మొదటి రకం వరిధాన్యం మద్ధతు ధర రూ.2203

– జిల్లా మార్కెటింగ్ డీపీఎం కరుణాకర్ 
– వరిధాన్యం కొనుగోళ్ల నిర్వహాకులకు శిక్షణ కార్యక్రమం 
నవతెలంగాణ-బెజ్జంకి 
మండలంలోని అయా గ్రామాల్లో ఐకేపీ అధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న వరిధాన్యం కొనుగోల కేంద్రాల్లో మొదటి రకం వరిధాన్యానికి రూ.2203 మద్ధతు ధర నిర్ణయించినట్టు జిల్లా మార్కెటింగ్ డీపీఎం కరుణాకర్ తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఐకేపీ కార్యలయంలో అయా గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు ఐకేపీ అధికారులు శిక్షణ కార్యక్రమం నిథ్వహించారు.సాదరణ రకం వరిధాన్యానికి రూ.2183 మద్ధతు ధర నిర్ణయించినట్టు డీపీఎం తెలిపారు. డీపీఎం విద్యాసాగర్, తహసిల్దార్ శ్యాం, ఏఓ సంతోష్, ఏపీఎం నర్సయ్య, సీసీలు పద్మ, సారయ్య, తిరుపతి, కొనుగోలు కేంద్రాల నిర్వహాకులు హజరయ్యారు.