
నవతెలంగాణ – మాక్లూర్
ప్రతి ఒక్కరూ తమ ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని నిజామాబాద్ డివిజన్ యూనిట్ మలేరియా అధికారి గోవర్దన్ తెలిపారు. సోమవారం మండల కేంద్రంలోని డెంగు పాజిటివ్ కేసు విసిట్ చేసి ఇంటి పరిసరాలు అన్నీ కూడా పరిశీలను చేశారు. స్థానిక ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, గ్రామపంచాయతీ కార్యదర్శి రాకేష్ అందరు కలిసి కాలనీలో ఉన్నటువంటి డ్రైనేజీలని, ఇంటింటి పరిసరాలని శుభ్రం చేయించారు. అక్కడక్కడ కనబడుతున్నటువంటి కంటైనర్స్, చెడిపోయిన వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తూ ప్రజలకు దోమల ద్వారా వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కలిగిస్తూ స్ప్రే చేయించారు. ఇంటింటిలో ప్రతి ఇంటి లోపల ఇండోర్ స్ప్రే పైరత్రం, డ్రైనేజీలు, మురికి కాలువల పైన టేమిఫాస్ స్ప్రే చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆరోగ్య సిబ్బంది, పర్యవేక్షణ సిబ్బంది సుధాకర్ ఏఎన్ఏం కమల, ఆశాలు శిరీష, జయషీలా, జ్యోతి, కరీమా, శిరీష పాల్గొన్నారు