నవతెలంగాణ-భిక్కనూర్
ప్రజలు తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని పంచాయతీ కార్యదర్శులు లక్ష్మి, సౌజన్య తెలిపారు. శుక్రవారం మండలంలోని పెద్ద మల్లారెడ్డి, ర్యాగట్లపల్లి ఆయా గ్రామాలలో పంచాయతీ సిబ్బంది చేత పారిశుద్ధ పనులు, విద్యుత్ దీపాలు, నీటి కులాయిలా సమస్యలను గుర్తించి మరమ్మత్తులు చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఇంటి పరిసరాలలో చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని, నీటి సమస్య ఉంటే గ్రామ పంచాయతీలో తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, తదితరులు ఉన్నారు.