– జీహెచ్‌ఎంసీలో కొనసాగుతున్న ప్రక్రియ
– వేగంగా కంప్యూటరీకరణ ప్రక్రియ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కొనసాగుతున్న సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ, కుల గణన సర్వే జీహెచ్‌ఎంసీ మినహా దాదాపు అన్ని జిల్లాలలో 99 శాతానికి పై చిలుకు పూర్తయిందనీ, 19 జిల్లాల్లో వంద శాతం అయిపోయిందని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. శుక్రవారం ఈ మేరకు సమాచార, పౌరసంబంధాల శాఖ స్పెషల్ కమిషనర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మరో వైపు కంప్యూటరీకరణ ప్రక్రియ కూడా అంతే వేగంగా కొనసాగుతున్నది. రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు సర్వే ప్రక్రియను వంద శాతం పూర్తి చేసి అంతే వేగంతో కంప్యూటరీకరణ చేసేందుకు తగు చర్యలు చేపడుతున్నారు. శుక్రవారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 49,79,473 నివాసాల సమాచారం కంప్యూటరీకరణ పూర్తయింది.