నవతెలంగాణ – నెల్లికుదురు
ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుకు సంబంధించి నిర్వహిస్తున్న సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో అన్నారు. శనివారం నెల్లికుదురు మండలంలోని నరసింహులగూడెం గ్రామంలో అధికారులు నిర్వహిస్తున్న సర్వే ను స్వయంగా పరిశీలించారు. సర్వే వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ప్రజల సందేహాలను నివృత్తి చేస్తూ సర్వే చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో అధికారులు పాల్గొన్నారు.