రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డుల లబ్ధిదారుల వివరాల నమోదులో పొరపాట్లకు తావు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలని అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) అబ్దుల్ హమీద్ అన్నారు. సోమవారం దుబ్బాక మున్సిపల్ పరిధిలోని ధర్మాజీపేటలో 7, 9 వార్డుల్లో కొనసాగుతున్న నూతన రేషన్ కార్డుల, ఇందిరమ్మ ఇండ్ల సర్వే ప్రక్రియను మున్సిపల్ కమిషనర్ కే.రమేష్ కుమార్ తో కలిసి ఆయన పరిశీలించారు.అధికారులకు,సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఆయన వెంట మున్సిపల్, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు.