
నవతెలంగాణ – బెజ్జంకి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సమగ్ర ఇంటింటి సర్వేకు కుటుంబ సభ్యుల వివరాలతో ఎన్యూమరేటర్లకు ప్రజలు సహరించాలని పంచాయతీ కార్యదర్శి ప్రనీత్ రెడ్డి ఆదివారం తెలిపారు. నేటి నుండి ఎన్యూమరేటర్లు ఇంటింటిని సందర్శించి సర్వే వివరాలు నమోదు చేస్తారని ప్రజలు తమ కుటుంబ సభ్యుల ఆధార్,రేషన్ కార్డు,భూమి ఉంటే పట్టా వివరాలందించాలని ప్రనీత్ రెడ్డి సూచించారు.