నవతెలంగాణ – లోకేశ్వరం
నిర్మల్ రూరల్ మండలం రాణాపూర్ గ్రామానికి చెందిన దమ్మా బాయి – పాండ్య నాయక్ లకు ఏడుగురు సంతానం (ఐదు గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు) ఇందులో మొదటి సంతానమైన సక్రియా నాయక్ 21-08-1996 లో జన్మించారు. ఇంటికి పెద్ద కుమారుడు కావడంతో తండ్రి తో కలిసి కుటుంబ బాధ్యతలు నిర్వర్తించేవాడు.. డిపార్ట్ మెంట్లో చేరాలని పట్టుదలతో చదివి 21-08-1990 లో కానిస్టేబుల్ కొలువు సాధించి మొట్ట మొదటగా నిర్మల్ టౌన్ లో విధులు నిర్వహించారు. 1998 లో హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొంది కుంటాల పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహించి అదిలాబాదు కు ట్రాపిక్ హెడ్ కానిస్టేబుల్ బదిలీపై వెళ్ళారు. అనంతరం బజార్ హత్నూర్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సమయంలో దాదాపు 50 మంది నక్సల్స్ ను జనజీవన స్రవంతిలో విలీనం చేశారు. 2005 లో ఏఎస్ఐ ప్రమోషన్ పొంది నిర్మల్ కు బదిలీ పై వచ్చారు. 2010 నుంచి 2014 వరకు లోకేశ్వరం లో విధులు నిర్వర్తించి మామడకు బదిలీ పై వెళ్ళారు. 2016 లో ఎస్ఐ గా పదోన్నతి పొంది వరంగల్ కు బదిలీ పై వెళ్లి అక్కడ ఎనిమిది నెలలు విధులు నిర్వహించి అదిలాబాద్ డిస్ట్రిక్ పోలీసు హెడ్ క్వార్టర్ లో నాలుగు సంవత్సరాలు కొత్తగా వచ్చిన కానిస్టేబుల్ లకు శిక్షణ ఇచ్చారు. అనంతరం నిర్మల్ కోర్టు లో లైసన్ ఆఫీసర్ గా విధులు నిర్వహించి లోకేశ్వరం ఎస్ఐ గా ఇటీవల బదిలీపై వచ్చారు. 2010 లో లోకేశ్వరం లో ఏఎస్ఐ గా విధులు నిర్వర్తించి ఇక్కడి ప్రజల మన్నలను పొందిన సక్రియా నాయక్ ఎస్ఐ గా పదోన్నతి తో వచ్చిన సందర్భంగా మండల నాయకులు, ప్రజలు సంతోష పడగ వారి సంతోషం ముదునాళ్ళ ముచ్చటకే ఆవిరైపోయింది ఉన్నత అధికారులు అతనిని బదిలీ చేస్తున్నారన్న వార్తను విని మండల ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారు. అధికారులు ఆయన బదిలీని నిలిపి వేయాలని మండల ప్రజలు, ప్రజా ప్రతినిధులు అధికారులను కోరుతున్నారు.