భువనగిరి మండలంలోని వడపర్తి గ్రామ తాజా మాజీ సర్పంచ్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు ఎలిమినేటి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో స్పర్శ లెప్రాసి క్యాంపెయిన్ అవగాహన కార్యక్రమం నిర్వహించి, ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్పర్శ ముఖ్యంశాలను స్పర్శ లేని, ఎర్రని రాగి లేదా గోధుమ రంగు గల మచ్చలు, కాళ్లు చేతులలో తిమ్మిర్లు, చెమటలు రాకుండా ఉన్నటువంటి మచ్చలు చికిత్స ఏం డి టి తో కుష్టి వ్యాధి పూర్తిగా నయమవుతుందని చర్మం పై స్పర్శ కోల్పోయిన మచ్చలు ఉండే వాటిని తాగినప్పుడు లేదా వాటిపై నొప్పి కలిగించినప్పుడు స్పర్శ తెలియకపోతే కుష్టు వ్యాధికావచ్చుని, మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా సమీప భవిష్యత్తులో కుష్టి వ్యాధి రహిత భారత దేశ నిర్మూలనలో కలసి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఎం ఎల్ హెచ్ పి డాక్టర్ కాంచన లక్ష్మి, కిరణ్ మై హెల్త్ అసిస్టెంట్, సిహెచ్ సునంద, హెల్త్ అసిస్టెంట్ కే. లలిత, ఐలమ్మ, ఆశాలు, వడపర్తి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.