నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
ప్రభుత్వం దివ్యాంగులకు హక్కులను కల్పించడం తో పాటు సమాజంలో వారి ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం జరుగుతుందని భువనగిరి స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ముందుగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం రోజు కలెక్టరేట్ సమావేశ మందిరంలో దివ్యాంగుల దినోత్సవ వేడుకలను స్థానిక ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్, గ్రంధాలయ చైర్మన్ అవేజ్ చిస్తి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి నాగిరెడ్డి,జిల్లాసంక్షేమ అధికారి నరసింహారావు, బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే మాట్లాడుతూ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం రోజు పలు ప్రాంతాల నుండి ఇక్కడకు రావడం గొప్ప విషయం అన్నారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం ప్రత్యేక అవకాశాలు కల్పిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.డిసెంబర్ ఒకటి నుంచి 9వ తేదీ వరకు ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలు జరుపుకుంటున్నామన్నారు. హాస్టల్లో చదువుకునే విద్యార్థులకు మెస్ చార్జీలు పెంచడం జరిగిందన్నారు.
హాస్టల్ చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడం జరుగుతుందన్నారు. త్వరలో ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. అర్హులైన దివ్యాంగులకు ట్రై సైకిల్, హియరింగ్ ఇవ్వడం జరుగుతుందని అన్నారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలలో ఉన్న దివ్యంగులకు వారి వారి వైకల్యంబట్టి పరికరాల అందించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంత రావు మాట్లాడుతూ..ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో దివ్యాంగుల కోసం త్వరలో ప్రత్యేకంగా ఒక్క సోమవారం నిర్వహించడం జరుగుతుందన్నారు. దివ్యాంగులు శారీరక లోపమే గాని మానసికంగా మంచి వారన్నారు.దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలన్నారు. దివ్యాంగుల కోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ర్యాంప్ లు కట్టించడం జరిగిందన్నారు. అర్హులైన దివ్యాంగుల కోసం ట్రై సైకిల్, బ్యాటరీ సైకిల్ ను కూడా ఇవ్వడం జరుగుతుందన్నారు.దివ్యాంగులకు ఉపాధి హామీ పథకం కింద వారి సామర్థ్యాన్ని బట్టి జాబ్ కార్డు ఇవ్వడం జరుగుతుందన్నారు. త్వరలో జిల్లాలో కృత్రిమ అవయవాల కోసం ప్రత్యేకమైన క్యాంపు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఈ క్యాంపు ద్వారా వారి వారి వైకల్యం ను బట్టి పరికరాలను రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు.స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గంగాధర్ మాట్లాడుతూ జిల్లాలో సదరం క్యాంపులు నిర్వహిస్తున్నామన్నారు. దివ్యాంగులందరూ తమ తమ ప్రతిభతో వివిధ రంగాల్లో ముందుకు వెళ్తున్నారన్నారు. దివ్యాంగులు శరీర లోపమే గాని మానసికంగా, స్థిరమైన ఆరోగ్యం కలిగి ఉంటారు అన్నారు. దివ్యాంగులు మన దేశం నుండి స్వర్ణ పథకాలు కూడా సాధించారన్నారు. మనదేశం 20వ స్థానంలో ఉందన్నారు. దివ్యాంగులకు 23 .11.2024 న ఆటల పోటీలు నిర్వహించగా.గెలుపొందిన వారికి బహుమతులను భువనగిరి ఎంఎల్ఏ, కలెక్టర్ ప్రధానం చేశారు. అనంతరం కమిటీ మెంబర్లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి యాదయ్య, సిడిపిఓలు, ఏపీఎంలు, దివ్యాంగుల అసోసియేషన్స్ వారు, జిల్లా సంక్షేమ కార్యాలయ సిబ్బంది లు పాల్గొన్నారు.