– ఇప్పటికే నాటిన మొక్కలు 28.69 లక్షలు
– జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్
– చర్లపటేల్‌గూడలో వన మహౌత్సవం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
జిల్లాలో వన మహౌత్సవంలో భాగంగా 82.59 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని జిల్లా అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తెలిపారు ఇప్పటికే 28.59 లక్షల మొక్కలు నాటామని వివరిం చారు. వన మహౌత్సవంలో భాగంగా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని చెర్లప టేల్‌గూడ జేబీ వెంచర్‌లో శుక్రారం మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వర్షాలు నిరంతరం కురుస్తున్నాయని చెప్పారు. పది రోజుల్లో జిల్లా స్థాయి నుంచి గ్రామపంచాయతీ వరకు ప్రతీ అధికారి వనమహౌత్సవంలో పాల్గొనాలని ఆద ేశించారు. ప్రతి గ్రామ పంచాయతీకీ ఆరు వేల మొక్క లు తగ్గకుండా నాటాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఇన్స్టిట్యూట్స్‌లు, గ్రామ కంఠం ఖాళీ స్థలాల్లో రోడ్లకు ఇరు పక్కల, రైతుల పొలం గట్ల పైన, నీటి, కరెంటు సౌకర్యం ఉన్న చోట పండ్ల తోటల పెంపకం చేపట్టాలని సూచిం చారు. ప్రతి ఇంటకీ ఐదు, ఆరు మొక్కలు ఇస్తున్నట్టు ప్రకటించారు. వా టన్నిటిని కూడా ఇంటి ముందు ఇంటి పెరట్లో నాటుకోవాలని సూచించినారు. మొక్కలను మ నం రక్షిస్తే అవి మనల్ని రక్షిస్తా యని చెప్పారు. పెరుగుతున్న కాలుష్యంతో జీవన ప్రమాణం తగ్గిపో తుందని అన్నారు. భావితరాలకి మంచి భవిష్యత్తు కోసం పచ్చని చెట్లే ప్రమాణికమ న్నారు. ఈ కార్యక్రమంలో డీ ఆర్డీఓ శ్రీలత, ఏపీడీ సక్రియనాయక్, ఎంపీడీవో వెం కటమ్మ, ఏపీఓ బి. తిరుపతాచారి, ఈసీ రవికుమార్, పం చాయతీ కా ర్యదర్శి శ్రీనివాస్, సాంకేతిక సహాయకులు శ్రీనివాస్, ఇం దిరా, సునంద, క్షేత్ర సహాయకుడు జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.