గడువులోపు సీఎమ్మార్ లక్ష్యాన్ని పూర్తి చేయాలి..

The target of CMMAR should be completed within the deadline.– పెండింగ్ బకాయిలపై ప్రత్యేక దృష్టి..
– జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
గడువులోగా సీఎమ్మార్ ధాన్యాన్ని ప్రభుత్వానికి అందించాలని జిల్లా కలెక్టర్  తేజస్ నంద్ లాల్ పవార్ మిల్లర్లను ఆదేశించారు.బుధవారం కలెక్టర్ ఛాంబర్ నందు సివిల్ సప్లై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2023 – 24  ఖరీఫ్, రబీ  సీజన్ లక్ష్యాలను సెప్టెంబర్ 30వ తేదీ కల్లా పూర్తి చేయాలని కలెక్టర్ తెలిపారు. గతంలో సీఎమ్మార్ చెల్లించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఎమ్మార్ పెండింగ్ బకాయిలపై సివిల్ సప్లయ్ అదికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ప్రత్యేక బృందాల ద్వారా మిల్లులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు.  అధికారులు సీఎమ్మార్ బియ్యం తీసుకోవడంలోనూ నాణ్యత ప్రమాణాలను పాటించాలని సివిల్ సప్లై అధికారులకు సూచించారు.  ఈ కార్యక్రమంలో డిసిఎస్ఓ టి రాజేశ్వర్ డి ఎం సివిల్ సప్లై ప్రసాద్ ఏసీఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.