విత్తన దుకాణాలను తనిఖీ చేసిన టాస్క్ ఫోర్స్ అధికారులు..

– నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం: దుకాణదారులకు హెచ్చరికలు జారి 
నవతెలంగాణ – మద్నూర్ 
మద్నూర్ మండలంలోని మద్నూర్,  ,మెనూరు,   గ్రామాల్లో గల  విత్తన  దుకాణాలను టాస్క్ఫోర్స్ టీమ్ బాన్సువాడ ఏ డి ఏ  వీరాస్వామి ఆధ్వర్యంలో స్థానిక వ్యవసాయ అధికారి రాజు తో కలిసి తనిఖీలు చేయడం జరిగింది.ముఖ్యంగా విత్తన డీలర్లు నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటామని. హెచ్చరికలు జారీ చేశారు. తెచ్చిన విత్తనాలకు బిల్లు, ఇన్వస్ , పిసి, స్టాక్ రిజిస్టర్ , స్టాక్ బోర్డు , లైసెన్సు అందుబాటులో ఉంచాలని  సూచించడం జరిగింది. అలాగే రైతులకు విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని సూచించడం జరిగింది, విత్తనాలు అమ్మిన వాటికి రసీదు తప్పకుండా ఇవ్వాలని మండల వ్యవసాయ అధికారి డీలర్లకు ఆదేశాలు జారీ చేశారురైతులు లైసెన్సు ఉన్న డీలర్ల దగ్గరే విత్తనాలు, ఎరువులు కొని రసీదు  తీసుకోవాలి, లూజుగా అమ్మే వితనాలను కొనవద్దని వ్యవసాయదారులకు తెలియజేశారు టాస్క్ ఫోర్స్ అధికారుల తనిఖీ కార్యక్రమంలో స్థానిక మండల
 వ్యవసాయ అధికారి  రాజు , బాన్సువాడ ఏ ఓ  సుధాకర్  పాల్గొన్నారు.